వాసవి మాత జయంతిని అధికారికంగా చేపట్టడానికి సీఎం ఆదేశాలు
హర్షం వ్యక్తం చేసిన బాదం
,
వనపర్తి నేటిదాత్రి .
*వాసవి మాత జయంతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
అధికారికంగా చేపట్టడానికి ఆదేశాలు జారీ చేయడం పట్ల కురుమూర్తి దేవస్థానం బోర్డ్ మెబర్ బాదం వెంకటేష్ ఒక ప్రకటన లో హర్షం వ్యక్తం చేశారు.”ఈసందర్భంగా బాదం మాట్లాడుతూ ,’వాసవి జయంతి పండుగ ‘మాత్రమే కాదని ఆర్యవైశ్యుల ప్రత్యేక ఆత్మగౌరవానికి” గుర్తింపు.వాసవి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం గర్వించదగ్గ విషయమని అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం అభినందనీయం మని ఇంతే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద ఆర్యవైశ్యుల నిమిత్తం ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కానీ నిరుపేద ఆర్యవైశ్యులు ఆన్లైన్లో దరఖాస్తు లు చేసుకున్నారని ఇప్పిటి వరకు ఆర్యవైశ్య కార్పొరేషన్ నుండి రుణాలు మంజూరు కాలేదని ఆయన పేర్కొన్నారు వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత ఆర్యవైశ్య కార్పొరేషన్ నుండి పేద ఆర్యవైశ్య లకు రుణాలు ఇప్పిం చి ఆదుకోవాలని బాదం వెంకటేష్ ఆర్యవైశ్యల తరుపున కోరారు విషయాన్ని గుర్తు చేస్తున్నాం.అదేవిధంగా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కల్పించడం. రాజకీయాలలో కూడా మంచి గుర్తింపు ఇస్తున్నందుకు కొత్తకోట దేవరకద్ర వనపర్తి జిల్లా ప్రజల ఆర్యవైశ్యుల తరుపున సీఎం రేవంత్ రెడ్డి దేవర్ కద్ర ఎమ్మెల్యే
జిఎంఆర్ కు బాదం ఒక ప్రకటన లో కృతజ్ఞతలు తెలిపారు
