కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంబరాలు
వివిధ రంగాల్లో ఉన్న మహిళలకు సత్కారాలు
సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి)
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సమావేశంలో భాగంగా రాజకీయంగా మహిళా మణులు, మహిళ సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, వార్డు కౌన్సిలర్లు మరియు మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని ఘనంగా సన్మానించారు.
కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కాముని వనిత మాట్లాడుతూ… సమావేశంలో మహిళల సాధికారత, సమాజంలో వారి పాత్ర గురించి అంతా ఇంతా చెప్పలేము అని అలాగే మహిళల అభివృద్ధి కోసం నిత్యం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు స్వయం సహాయక సంఘాల ప్రోత్సాహం, విద్యా అవకాశాలు, ఆరోగ్య పరిరక్షణ వంటి అంశాలపై చర్చించారు.
అదే విధంగా మహిళల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలు, మహిళలకు సమాన హక్కులు, ఉద్యోగ అవకాశాలు కల్పించడం, రాజకీయాల్లో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి విషయాలను కూడా సమావేశంలో ప్రస్తావించారు. మహిళలు ప్రతి రంగంలో ముందుకు రావాలని, సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని నాయకులు పిలుపునిచ్చారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల సేవలను గుర్తుచేసుకుంటూ వారికి అభినందనలు తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో ఏం సి చైర్మన్, టౌన్ అధ్యక్షురాలు వెలుముల స్వరూప, జిల్లా ప్రధాన కార్యదర్శి కోడం అరుణ, వైస్ ప్రెసిడెంట్ రోజా సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు మడుపు శ్రీదేవి, అన్ని మండలాల అధ్యక్షురాలు, జిల్లా కార్యవర్గం టౌన్ కార్యవర్గం అందరూ కూడా కాంగ్రెస్ మహిళా సోదరీమణులు అందరు కూడా పాల్గొనడం జరిగినది.
