ఘనంగా మొహరం వేడుకలు .. సిద్ధిక్ సాహెబ్ పీర్ల మసీదుకు పోటెత్తిన భక్తులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ మాణిక్ ప్రభు మహిళలో సిద్ధిక్ సాహెబ్ పీర్లను మొహమ్మద్ అహ్మద్ సాహెబ్ కు చూసేందుకు భక్తజనం పోటెత్తింది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర,కర్ణాటక నుంచి భక్తులు వేల సంఖ్యలో హాజరయ్యారు.భక్తుల రాకతో నియోజకవర్గలో సందడి నెలకొంది. భక్తులు మేళ తాళాలతో పీర్ల చావడీని దర్శించుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి హాజరైన భక్తులు హసన్, హుస్సేన్ లకు గొర్రెలు, మేకలతో కందూర్లు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. మరి కొందరు బెల్లం, పుట్నాలు, గోధుమలతో తయారుచేసిన మలీజా నైవేద్యాన్ని సమర్పించుకున్నారు.అత్యంత వైభవంగా జరిగే మొహరం ఉత్సవాల్లో భాగంగా చిరు వ్యాపారులు గాజులు, మిఠాయి, ఆట వస్తువుల దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారు. జహీరాబాద్ నియోజకవర్గం ప్రజలందరూ శాంతిభద్రతలను పరిరక్షించేందుకు జహీరాబాద్ డిఎస్పి సైదా నాయక్ ఆధ్వర్యంలో వివిధ విభాగాలకు చెందిన పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.