ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న.. సర్పంచ్ దుబ్బ (గున్నెల) శ్రీను

ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న.. సర్పంచ్ దుబ్బ (గున్నెల) శ్రీను

వెల్దండ / నేటి ధాత్రి :

 

కల్వకుర్తి నియోజకవర్గం లోని
వెల్దండ మండలంలోని రాచూరు గ్రామ సర్పంచ్ గున్నెల శ్రీనివాస్ తన ఎన్నికల హామీని నిలబెట్టుకున్నారు. సర్పంచ్ ఎన్నికల సమయంలో విజయం సాధిస్తే.. గ్రామంలోని ఆడబిడ్డల పెళ్లికి ₹10,116 నగదు కానుకగా అందజేస్తానని ఇచ్చిన మాటను ఆయన అమలు చేస్తున్నారు. ఈ సందర్భంగా.. కొంగళ్ళ శ్యామలమ్మ&ఐలెన్ దంపతుల రెండవ కుమార్తె చిత్ర వివాహ సందర్భంగా.. శనివారం సర్పంచ్ రూ.10,116 నగదు సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సురేష్ రెడ్డి, గంగదారి రమేష్.. గంగదారి శ్రీనివాస్, మదార్, రాజశేఖర్, పాండు, శ్రీశైలం శంకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version