మాల్గి మాజీ సర్పంచ్ జల్గొండ మారుతిని అక్రమ అరెస్టు
జహీరాబాద్ నేటి ధాత్రి:
మాజీ సర్పంచుల కోసం పెండింగ్‌లో ఉన్న బిల్లులకు సంబంధించిన నిరసనలో భాగంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళుతున్న జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండల మల్గి గ్రామ మాజీ సర్పంచ్ జలగొండ మారుతిని మార్గమధ్యంలో అక్రమంగా అరెస్టు చేసి హద్నూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.ఈ సందర్భంగా మాట్లాడిన మాజీ సర్పంచ్ జల్గొండ మారుతి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు అయిందని, పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించకుండా, అక్రమ అరెస్టులు చేస్తూ ఇంకెంతకాలం కాలయాపన చేస్తారని తీవ్రంగా విమర్శించారు.
రుణాలు తీసుకుని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టి మూడేళ్లయిందని ఆయన పేర్కొన్నారు. బిల్లులు చెల్లించలేని తమ అసమర్థతను దాచిపెట్టేందుకు ప్రభుత్వం పోలీసులను, ప్రభుత్వ అధికారులను వాడుకుని పారిపోవడానికి ప్రయత్నిస్తే, రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం నేర్పిస్తారని ఆయన హెచ్చరించారు.మాజీ సర్పంచుల బకాయి బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
