మనగ్రామం- మన బాధ్యత

మనగ్రామం- మన బాధ్యత

తహరాపూర్ గ్రామంలో శుభ్రత కార్యక్రమాలు

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలం తహ రాపూర్ (మందారిపేట) గ్రా మంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో శుభ్రత కార్యక్ర మాలు విస్తృత స్థాయిలో కొనసాగుతున్నాయని స ర్పంచ్ కుక్కల సరోజన తెలి పారు. గ్రామ ప్రజల ఆరోగ్యా న్ని దృష్టిలో ఉంచుకొని పలు పారిశుద్య చర్యలు చేపట్టిన ట్లు వెల్లడించారు. గ్రామ పం చాయతీ పరిధిలోని వాటర్ ట్యాంకులను ప్రతి 15 రోజు లకు ఒకసారి శుభ్రపరచి బ్లీ చింగ్ చేయడం జరుగుతుం దని పేర్కొన్నారు. అలాగే మురికి కాలువలను కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి శుభ్రం చేసి చెత్త తొలగించి బ్లీచింగ్ నిర్వహిస్తున్నారు
డ్రైనేజీల నుంచి తీసిన మురికిని మరుసటి రోజే పూర్తిగా తొలగించే చర్యలు తీసుకుంటున్నట్లు, రోడ్లకు ఇరువైపులా పేరుకుపోయిన చెత్తను తొలగిస్తూ గ్రామ పారి శుద్యాన్ని మెరుగుపరుస్తున్న ట్లు చెప్పారు.ఈ చర్యల ద్వారా రాబోయే రోజుల్లో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులను నివారించవ చ్చని, గ్రామ పంచాయతీ నోటీసు బోర్డులో ఈ విధి విధా నాలు పొందు పరిచినట్లు సర్పంచ్ పేర్కొన్నారు. గ్రామ ప్రజలందరూ సహకరించి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉం చాలని అన్నారు.మన గ్రామం – మన బాధ్యత” అనే నినాదంతో ఈ కార్యక్రమాలు కొనసాగించాలి. ఈ కార్యక్రమంలో గ్రామ పం చాయతీ కార్యదర్శి అజయ్, చలివాగు ప్రాజెక్ట్ డైరెక్టర్ కుక్కల తిరుపతి, బడుగు సునీల్, తక్కల్ల సారయ్య, పిండి రవి, పూజారి సారయ్య, నిమ్మల యాదయ్య, లక్కర్స్ మొగిలి పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version