మద్యం,గుట్కా చెడు అలవాట్లపై అవగాహనా….

మద్యం,గుట్కా చెడు అలవాట్లపై అవగాహనా

గుండాల,నేటిధాత్రి :

దామరతోగు గ్రామంలో గ్రామోత్సవ సభ నిర్వహించారు .ఈ కార్యక్రమంలో గుండాల సీఐ తిరుపతి,ఎస్సై సైదా రహూఫ్ పోలీస్ సిబ్బంది, గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డ్ మెంబర్లు, పంచాయతీ సిబ్బంది మరియు సుమారు 80 మంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఎస్సై రహూఫ్ మాట్లాడుతూ గ్రామం వెనుకబడటానికి గల ముఖ్య కారణాలను వివరించి, యువత అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, మద్యం మరియు గుట్కా వంటి చెడు అలవాట్లకు అలవాటు పడవద్దని సూచించారు. అనంతరం సీఐ తిరుపతి మాట్లాడుతూ గత పరిస్థితులతో పోలిస్తే ప్రస్తుత పరిస్థితులు మెరుగుపడ్డాయని, విద్యపై దృష్టి పెట్టాలని, పోలీస్ శాఖ నుండి అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా మండలానికి చెందిన కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం (కానిస్టేబుల్) సాధించిన బాలరాజు మరియు కిరణ్‌లను శాలువా కప్పి సన్మానించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version