చిరస్మరణీయం.. ఎన్నేళ్లో వేచిన ఉదయం.. ఆ రోజు నిజమైంది!
ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదింపుతూ ఆర్సీబీ కప్పును ముద్దాడింది. ఆ ఎమోషనల్ జర్నీ సాగిందిలా..
అలా జరిగింది..
అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో పంజాబ్‌తో తలపడిన ఆర్సీబీ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. 200 సాధించినా కాపాడుకోవడం కష్టమైన పిచ్‌పై బెంగళూరు చేసింది 190 పరుగులే! ఎలిమినేటర్‌లో ఇదే మైదానంలో రెండొందలపైన స్కోరు చేసిన ముంబై ఇండియన్స్‌ను ఓడించిన పంజాబ్‌కు ఈ లక్ష్యం ఒక లెక్కా అనిపించింది. కానీ, రజత్ పాటీదార్ సారథ్యంలోని బెంగళూరు బెదర్లేదు. పంజాబ్‌కు కళ్లెం వేసి ట్రోఫీ(IPL 2025) కైవసం చేసుకుంది. కృనాల్పాండ్య, భువనేశ్వర్ విజయంలో కీలకపాత్ర పోషించారు. కెరీర్ ఆరంభం నుంచి బెంగళూరు తరఫునే ఆడినా ట్రోఫీని అందుకోలేకపోయిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కెరీర్ చివర్లో తన అభిలాషను నెరవేర్చుకున్నాడు. అయితే ఐపీఎల్ 2025 సీజన్(18), విరాట్ జెర్సీ నంబర్(18) ఒకటే కావడం విశేషం.
