చిరస్మరణీయం.. ఎన్నేళ్లో వేచిన ఉదయం.. ఆ రోజు నిజమైంది..

చిరస్మరణీయం.. ఎన్నేళ్లో వేచిన ఉదయం.. ఆ రోజు నిజమైంది!

ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదింపుతూ ఆర్సీబీ కప్పును ముద్దాడింది. ఆ ఎమోషనల్ జర్నీ సాగిందిలా..

ఇంటర్నెట్ డెస్క్: జూన్ 3 2025.. కోట్లాది మంది అభిమానుల కళ్లు ఆనంద బాష్పాలతో తడిసిన రోజది. ఎన్నో ఏళ్ల నిరీక్షణ.. ఎన్ని పరాభవాలు.. ఎంత నిరాశ.. ఎన్ని నిట్టూర్పులు! అన్నింటినీ దాటుకుని ఎట్టకేలకు సాధించింది రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు! ఐపీఎల్ ఆరంభం నుంచి జట్టును వీడని విరాట్ కోహ్లీ(Virat Kohli) చేతిలో ఐపీఎల్ ట్రోఫీని చూడాలన్న అభిమానుల కల ఇన్నేళ్లుకు నెరవేరింది.
ఒకడు జట్టుపై ఎంతో ప్రేమ చూపిస్తే.. అది క్రికెట్! ఒక ప్లేయర్ కోసం జట్టు కోసం ప్రాణమిచ్చేంత అభిమానం పెంచుకుంటే.. అది క్రికెట్! సాటి జట్లు కూడా ఒక ప్లేయర్‌కు దడిస్తే.. అది క్రికెట్! ఒకడు అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ పెట్టుకుంటే.. అది క్రికెట్! కోట్ల మంది కళ్లప్పగించిన వేళ.. కష్టమనుకున్న మ్యాచ్‌ను ఆ జట్టు సాధించుకున్న తీరు అద్భుతం. అభిమానుల ఆశలకు రూపమిస్తూ.. ఐపీఎల్‌లో బెంగళూరు కొత్త ఛాంపియన్‌గా అవతరించింది. ఆర్సీబీ… ఈ సాలా కప్ నమ్‌దూ!

అలా జరిగింది..

అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్‌లో పంజాబ్‌తో తలపడిన ఆర్సీబీ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. 200 సాధించినా కాపాడుకోవడం కష్టమైన పిచ్‌పై బెంగళూరు చేసింది 190 పరుగులే! ఎలిమినేటర్‌లో ఇదే మైదానంలో రెండొందలపైన స్కోరు చేసిన ముంబై ఇండియన్స్‌ను ఓడించిన పంజాబ్‌కు ఈ లక్ష్యం ఒక లెక్కా అనిపించింది. కానీ, రజత్‌ పాటీదార్‌ సారథ్యంలోని బెంగళూరు బెదర్లేదు. పంజాబ్‌కు కళ్లెం వేసి ట్రోఫీ(IPL 2025) కైవసం చేసుకుంది. కృనాల్‌పాండ్య, భువనేశ్వర్‌ విజయంలో కీలకపాత్ర పోషించారు. కెరీర్‌ ఆరంభం నుంచి బెంగళూరు తరఫునే ఆడినా ట్రోఫీని అందుకోలేకపోయిన స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి కెరీర్‌ చివర్లో తన అభిలాషను నెరవేర్చుకున్నాడు. అయితే ఐపీఎల్ 2025 సీజన్(18), విరాట్ జెర్సీ నంబర్(18) ఒకటే కావడం విశేషం.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version