RMPల క్లినిక్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన డాక్టర్ శ్రీదేవి

ఆర్ఎంపీల క్లినిక్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన డాక్టర్ శ్రీదేవి

భూపాలపల్లి నేటిధాత్రి

ఆర్ఎంపి క్లినిక్లను తనిఖీ చేసిన ఇంచార్జ్ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ శ్రీదేవి భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఆర్ఎంపి పిఎంపి చికిత్స కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విధిగా ప్రధమ చికిత్స కేంద్రము అని బోర్డు పెట్టాలని తెలిపారు
వీరు రోగ నిర్ధారణ చేసి మందులు ఇచ్చుట లేదా ఇంజక్షన్లు చేయుట,ఎటువంటి వైద్య మందుల చిట్టిని వాడకూడదు, సెలైన్ బాటిల్స్ ఎక్కించడము చేయకూడదు, రక్త పరీక్షలు,మూత్ర పరీక్షలు, చేయరాదు అధిక మోతాదు మందులు వాడడం రక్త పరీక్షలు చేయడం అబార్షన్లు చేయడం కాన్పులు నిర్వహించడం అంటే చేయరాదు హెచ్చరించినారు,కేవలము ప్రధమ చికిత్స మాత్రమే అందించి అర్హతగల ఆసుపత్రులకు పంపించవలెనని సూచించినారు, గతంలో కూడా వీరికి నోటీసులు ఇవ్వనైనది, నిబంధనలను అతిక్రమించి చికిత్స చేసిన వారిపై ప్రభుత్వ ఆదేశానుసారం కఠిన చర్యలు తీసుకొనబడతాయని హెచ్చరించినారు
వారి పక్కనున్నటువంటి మెడికల్ షాపులను సందర్శించి ఆర్.ఎం.పి ల యొక్క ప్రిస్క్రిప్షన్ నందు మందులు అమ్మ రాదని హెచ్చరించినారు లేనియెడల మెడికల్ షాపులు సీజ్ చేయాల్సి వస్తుందని సూచించారు. ఈ కార్యక్రమములో
పి హెచ్ సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రోహిణి, డెమో శ్రీదేవి, భూపాలపల్లి హెచ్ వి, ఏఎన్ఎం పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version