లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ కనెక్షన్ల పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్న
*పలమనేరు ఎమ్మెల్యే ఎన్ అమర్
నాధ్ రెడ్డి…
దీపం పథకాన్ని దేశంలోనే మొట్ట మొదటగా చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేయడం జరిగిందన్నారు,
పెద్దపంజాణి (నేటి ధాత్రి:
పలమనేరు నియోజకవర్గం పెద్దపంజాణి మండలంలోని రాయలపేట పంచాయతీ కేంద్రంలో శాసనసభ్యులు అమరనాథ రెడ్డి మంగళవారం లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ కనెక్షన్ల పంపిణీ చేపట్టారు. అనంతరం చెత్త సేకరణ బండ్లను ప్రారంభించారు*.
ఈ సందర్భంగా ప్రజల ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ*…..
అర్హులందరికీ ప్రభుత్వం గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వడం జరుగుతుందని
ఆయన అన్నారు,
దీపం పథకాన్ని దేశంలోనే మొట్ట మొదటగా చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేయడం జరిగిందన్నారు,
ప్రస్తుతం దీపం పథకం-2 ద్వారా ఏడాది కి మూడు సిలిండర్లు ఇవ్వడం జరిగిందని ఈసందర్బంగా
ఆయన మీడియా తో తెలిపారు,
మహిళలను ఆర్థిక, సామాజిక, ఆరోగ్యపరంగా ముందుకు తీసుకొస్తే ఆ కుటుంబం బాగుపడుతుంది కుటుంబం బాగుంటే ఊరు బాగుంటుంది… ఊర్లు బాగుపడితే దేశం బాగుపడుతుందని ఆయన కొనియాడారు,
డ్వాక్రా గ్రూపులను ఏర్పాటు చేసి మహిళలకు పొదుపును అలవాటు చేయడం జరిగింది*…
అదే ధోరణితో మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చి దిద్దాలని చంద్రబాబు గారు ఎన్నో ప్రోత్సాహకాలను అందిస్తూ మహిళలు ఆర్థిక శక్తిగా ఎదిగే కార్యక్రమాలు చేస్తున్నారు….మహిళలు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆ
ఈ సందర్బంగా ఆయన తెలిపారు,
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా సూపర్ సిక్స్ పథకాలను అందించడం జరిగిందని
ఆయన అన్నారు,
ఐదేళ్లకు ఓ ప్రభుత్వాన్ని మార్చే నిర్ణయంతో అందరు నష్టపోతామని గుర్తించండి అని రాయలపేట గ్రామ
ప్రజలకు ఆయన సూచించారు,
రాయల పేట పరిసర ప్రాంతాలకు కూడా హాంద్రినీవా నీళ్లు తీసుకోచ్చేందుకు కృషి చేస్తున్నాం.. ఈ విషయమై సీఎం కి కూడా తెలియజేయడం జరిగింది… త్వరలో కార్యరూపం దాల్చేలా చూస్తాంమని ఆయన ఈసందర్బంగా తెలిపారు,
గత ప్రభుత్వ తప్పిదాలతో పెట్టుబడిదారులు రాష్ట్రం నుంచి పారిపోయే పరిస్థితి సృష్టించారు… అయితే నేడు పెట్టుబడులు తెచ్చేందుకు సీఎంతో పాటు మంత్రి లోకేష్ మరియు ఇతర మంత్రులు పెట్టుబడుల వేటలో తీవ్రంగా శ్రమిస్తున్నారని ఆయన కొనియాడారు,
రాష్ట్రానికి పెట్టుబడులు వస్తేనే ఆదాయం పెరుగుతుంది తద్వారా మరిన్ని అభివృద్ధి,సంక్షేమ పథకాలను చేపట్టుకునేందుకు అవకాశం కలుగుతుందన్నారు,
రాయలపేట పరిసర ప్రాంతంలో నెలకొన్న సెల్ టవర్ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు,
ప్రభుత్వపరంగా చేయాల్సిన కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తామన్నారు,
రాయలపేట మండల కేంద్రంగా ఏర్పాటుకు అనుకూలమైన ప్రాంతం… భవిష్యత్ లో నియోజకవర్గాలు, మండలాలు పునర్విభజన కాబోతున్నాయి… ఆ సందర్భంలో అవకాశం ఉంటే మండల కేంద్రంగా చేసుకుందామన్నారు,
రాజకీయంగా రాష్ట్ర స్థాయిలో మా కుటుంబం నిలబడేందుకు సహకరించిన ఈ ప్రాంత ప్రజలకు రుణపడి ఉంటామని ఆయన అన్నారు,
ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు…అందరికీ మంచి జరగాలని ఆయన కోరారు,
స్థిరమైన ప్రభుత్వం తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుంది కాబట్టి భవిష్యత్ లోనూ కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని
ఆయన పిలుపునిచ్చారు,
ఈ కార్యక్రమంలో మండల అధికారులు సిబ్బందితో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు…
