తాలిపేరు ప్రాజెక్ట్ కు పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు

తాలిపేరు ప్రాజెక్ట్ కు పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించండి కుడి ఎడమ కాలువలను బాగుచేయండి

బిఆర్ఎస్ డివిజన్ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ మానే రామకృష్ణ సాగి శ్రీనివాస రాజు

నేటిధాత్రి చర్ల

చర్ల మండల రైతుల సమస్యలపై తాలిపేరు ప్రాజెక్ట్ కుడి కాలవ ఎడమ కాలవలను పరిశీలించిన బిఆర్ఎస్ పార్టీ డివిజన్ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ మానెం రామకృష్ణ సాగి శ్రీనివాసరాజు

 

 

ప్రాజెక్ట్ ఎడమ కాలవకు బోటు గుడెం దగ్గర రెండు చోట్ల గండి కొట్టింది వర్షాకాలంలో బారి వర్షాలు ఉండడం చేత ప్రాజక్ట్ లో నీటి విడుదల చేస్తే కొట్టుకు పోయి నీరు మొత్తం కిందకు వెళ్లే అవకాశం లేదు దీని వలన రైతుల నష్టపోతారు డిఈ దీర్ఘకాలికగా పని చేస్తూ అవినీతికి అలవాటు పడి ప్రాజక్ట్ కాలువలను పట్టించుకోక పోవడంతో అస్తవ్యస్తంగా తయారయ్యాయి నూతనంగా నిర్మిస్తున్న తాలుపెరుగేట్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని తాలిపేరు ప్రాజెక్టులోని నీటిని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మండలంలోని చెరువులకు నీటిని అందించాలని సంవత్సరం మొత్తం నీరు రైతులకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని అన్నారు .

 

కొయ్యూరు సుబ్బంపేట పుసుగుప్ప ఉప్పరిగుడం లక్ష్మీ కాలనీ గ్రామపంచాయతీలోని పంటపొలాలకు సాగునీరు అందించాలని రైతుల పట్ల కాలవల పట్ల ద్వంద వైఖరి చూపిస్తున్న డిఈ ని వెంటనే బదిలీ చేయాలని డివిజన్ నాయకులు డిమాండ్ చేశారు డిఈ ని వెంటనే ఈ కాలవపై ఉన్న గండ్లలను పరిశీలించి మరమ్మత్తులు చేయించాలని కింది ప్రాంతంలో ఉన్న రైతులకి నీరు సకాలంలో అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ సమస్య పరిష్కారానికి వారం రోజులలో చర్యలు తీసుకొని ఎడల బిఆర్ పార్టీ ఉద్యమం చేపడతామని డివిజన్ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ మానెం రామకృష్ణ హెచ్చరించారు అధికారుల నిర్లక్ష్యం అవినీతి వలన ఈ ప్రాంత రైతులు నష్ట పోతున్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల కన్వీనర్ దొడ్డి తాతారావు కోకన్వీనర్ అయినవోలు పవన్ కుమార్ నాతాని రాము మాజీ ఎంపీటీసీ చంటి ఎస్సీ సెల్ అధ్యక్షులు కొంబత్తిని రాము మండల యూత్ అధ్యక్షులు అంబోజి సతీష్ నాయకులు తడికల బుల్లిబ్బాయి సిద్ది సంతోష్ మాజీ సర్పంచ్ కమల అనేకమంది రైతులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version