ఎండతీవ్రతకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
* రాష్ట్రంలో ఎండతీవ్రతకు 6గురు వ్యక్తులు మరణించారు
* గౌడ సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు జి. వెంకటేష్ గౌడ్
నేటిధాత్రి :చేవెళ్ల :
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. భానుడి భగభగలకు జనం అల్లాడిపోతున్నాయి. సోమవారం పలు జిల్లాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సందర్బంగా గౌడ సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు జి. వెంకటేష్ గౌడ్ ప్రజలకు మాట్లాడుతూ. ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోందని, రోజువారీ కూలీలు, ప్రజలు, పిల్లలు, పెద్దలు బయటికి వెళ్లోద్దని కోరారు. ముఖ్యంగా రంగారెడ్డి, హైద్రాబాద్ జిల్లాలో అత్యధికంగా 41.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని ., హైదారబాద్‌తో పాటు రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ పగటి ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల మార్కు దాటేశాయని 43 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదై జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించ్చిందని తెలిపారు. తీవ్రమైన ఈ ఎండలు ప్రాణాపాయంగా మారుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో వేర్వేరు చోట్ల వడదెబ్బకు గురై ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని, కాబట్టి ప్రజలు ఎవరు బయటికి రావద్దని సూచించారు. ఒకవేళ అత్యవసర పనులు ఉంటే ఉదయం 11 గంటల లోపే పూర్తి చేయనుకోవాలని ప్రజలకు సూచించారు.
