మా గ్రామంలో కూడా తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను ఏర్పాటు చేయాలి…

మా గ్రామంలో కూడా తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను ఏర్పాటు చేయాలి

నడికూడ,నేటిధాత్రి:

మండలంలోని నార్లాపూర్ గ్రామ పాఠశాల అభివృద్ధి కోసం వీరేశలింగం సలహా మేరకు ఆరుట్ల గ్రామం మంచాల మండలం రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను గ్రామ కాంగ్రెస్ నాయకులు,గ్రామస్తులు సందర్శించారు.గ్రామంలో ప్రెస్ మీట్ నిర్వహించి గ్రామ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయులచే విద్యా బోధన జరుగుతుందని ఇలాంటి స్కూల్ ను మా నార్లాపూర్ గ్రామంలో ఏర్పాటు చేయాలని అరుట్ల గ్రామంలో ఉన్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ దానిని ఆదర్శంగా తీసుకొని మా గ్రామంలో కూడా ఇలా చేసుకుంటే బాగుంటుందని మేమందరం నిర్ణయానికి రావడం జరిగిందని టిపిఎస్ లో ఒకసారి అడ్మిషన్ తీసుకుంటే ఇంటర్ వరకు విద్యా బోధన అందించబడుతుందని,పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి చొరవ తీసుకొని సహకరిస్తే మేం ఊరిలో ఉన్న సుమారుగా రెండు ఎకరాల భూమిని అందరి సహకారంతో కొనుగోలు చేసి చుట్టూ ఉన్న గ్రామాలు కూడా బస్సు సౌకర్యం ఏర్పాటు చేసుకొని ఆ స్కూలు విజయవంతంగా నిర్వహించుకుంటాం,ఎమ్మెల్యే సహకరించి ఆ స్కూలుకు సాంక్షన్ కోసం సీఎంతో చర్చించి పాఠశాలను అందించాలని గ్రామస్తుల తరఫున కోరుతున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు ఈర్ల చిన్ని,ఈర్ల సాంబయ్య, నాగపురి సారంగపాణి, శనిగరపు శ్రీధర్,కె. శ్రీనివాస్, ఓరుగంటి రాజయ్య, ప్రతాపరెడ్డి, సరోజన, సమ్మక్క,విజయ గ్రామస్తులు తదితరులు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version