నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే జీఎస్సార్..

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే జీఎస్సార్

భూపాలపల్లి నేటిధాత్రి

బుధవారం రేగొండ మండలంలోని కొడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో అయిలి మారుతి ప్రో.జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 35 జంటల సామూహిక వివాహ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించినారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన దంపతులను ఆశీర్వదిస్తూ,సమాజంలో సామూహిక వివాహాలు ఆర్థికంగా బలహీన వర్గాలకు ఎంతో ఉపయుక్తమని,ఇటువంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నాయినేని సంపత్ రావు అయిలి మారుతి అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version