మీడియా అకాడమీ చైర్మన్ కలిసిన ఐజేయూ జిల్లా నాయకులు..

మీడియా అకాడమీ చైర్మన్ కలిసిన ఐజేయూ జిల్లా నాయకులు

భూపాలపల్లి నేటిధాత్రి

 

తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఐజేయు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ని ఘనంగా సన్మానించారు.
జిల్లా అధ్యక్షులు క్యాతం సతీష్ కుమార్, ప్రధాన కార్యదర్శి సామంతు శ్యామ్ నేతృత్వంలో నిన్న హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఐజేయు రాష్ట్ర అధ్యక్షులు విరహత్ హలి ఆద్వర్యంలో నిర్వహించిన స్టేట్ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో మీడియా అకాడమీ చైర్మన్
కే. శ్రీనివాస్ రెడ్డి రెండవసారి తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా, ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, జర్నలిస్టుల అక్రిడిటేషన్ ప్రక్రియను వేగవంతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వర్కింగ్ జర్నలిస్టులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, జర్నలిస్టులు ఎటువంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం అధిక సంఖ్యలో అక్రిడిటేషన్లు మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు.
జర్నలిస్టుల సంక్షేమం, మీడియా రంగ అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న సేవలను జిల్లా అధ్యక్షులు క్యాతం సతీష్ కుమార్ అభినందించారు.
భవిష్యత్తులో కూడా జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం మరింత కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు జర్నలిస్టులు, ప్రతినిధులు మరియు నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version