పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మార్నింగ్ వాక్

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మార్నింగ్ వాక్
శ్రీరాంపూర్ :నేటి ధాత్రి

శ్రీరాంపూర్ ప్రాంతంలోని ప్రగతి మైదానంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మంగళవారం ఉదయం మార్నింగ్ వాక్ చేసి వాకర్స్ ను ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నాయకులు వారిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. విద్యార్థి, యువకులు, మహిళల,కార్మిక వర్గ, ప్రజల సమస్యల పరిష్కారం కొరకు ప్రజా గొంతుకై పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వాని ప్రశ్నిస్తూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న ఆయనను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె నర్సింగ్, జిల్లా నియోజక వర్గ ఏరియా నాయకులు కే వినయ్ ప్రశాంత్, డి మురళి, బి ఒదేలు, బి నర్సయ్య సిచ్ వాసు ఎం శ్యాముల్, కొమురయ్య పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version