సూర్యమ్‌కు జాతీయ స్థాయి ఫార్మసీ టీచర్ అవార్డు

జాతీయస్థాయి స్థాయి పురస్కారం సూర్యమ్ కు లభించింది

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం మైలారం గ్రామం నివాసులైన సూర్యమ్ మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని విష్ణు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సూర్యమ్ దేశవ్యాప్తంగా నిర్వహించిన పోటీలో “బెస్ట్ నేషనల్ ఫార్మసీ టీచర్ అవార్డు – 2025” ను అందుకుని విశేష గౌరవాన్ని పొందారు. ఈ అవార్డును తెలంగాణ రాష్ట్రంలోని ఎంఎన్ఆర్ యూనివర్సిటీ, సంగారెడ్డి లో జరిగిన కార్యక్రమంలో ప్రదానం చేశారు. సూర్యమ్ ఫార్మసీ విద్యార్థులకు బోధించిన “సైజ్ రిడక్షన్ టెక్నిక్” అనే అంశంపై ఇచ్చిన ఉత్తమ ఉపన్యాసానికి గుర్తింపుగా ఈ జాతీయ స్థాయి పురస్కారం లభించింది. బోధనలో నూతన పద్ధతులు, సులభమైన వివరణ, ప్రాక్టికల్ అవగాహన కల్పించే విధానం వల్ల విద్యార్థుల్లో మంచి స్పందన పొందిన ఆయనకు ఈ అవార్డు దక్కడం గర్వకారణం.
విష్ణు ఇన్‌స్టిట్యూట్ యాజమాన్యం, సహచర అధ్యాపకులు విద్యార్థులు సూర్యమ్ ని అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ అవార్డు ద్వారా నర్సాపూర్ ప్రాంతానికి, అలాగే మెదక్ జిల్లాకు విశేష గుర్తింపు లభించింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version