శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా కార్తీక దీపోత్సవం
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం: రాష్ట్రంలోని శైవ క్షేత్రాల్లో ప్రసిద్ధిగాంచిన ఝరాసంగం శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. దేవాలయంలో ఉదయం శ్రీ పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి వారికి మేల్కొలుపు పూజ, గణపతి పూజ, రుద్రాభిషేకము, అమ్మవారికి సామూహిక కుంకుమార్చన, మహా మంగళ హారతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు భారీగా తరలి వచ్చారు. భక్తులు అమృత గుండాల్లో స్నానమాచరించి కార్తీక దీపాలను వెలిగించారు.
శివపార్వతులకు ప్రత్యేక రుద్రేభిషేకాలు నిర్వహించి ముడుపులు చెల్లించుకున్నారు. మహిళా భక్తులు ఆలయం చుట్టూ దీపాలు వెలిగించారు. కొందరు మహిళలు గండ దీపాలను వెలిగించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ చైర్మన్ ఏ చంద్రశేఖర్ శివరుద్రప్ప కార్యనిర్వహణాధికారి
అర్చక బృందం పూర్తి ఏర్పాట్లు చేశారు. దేవస్థానానికి వచ్చిన భక్తులకు ఉచిత అన్నదానం సౌకర్యం సైతం ఏర్పాటు చేశారు.శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానం లో ఝరాసంగం మాజీ జడ్పీ చైర్మన్ సునీత పటేల్ హనుమంత్ రావు పటేల్ ఆలయ కమిటీ చైర్మన్ చంద్ర శేఖర్ పటేల్ కార్యనిర్వాహణ అదీకారి శివ రుద్రప్ప మండల అర్చక బృందం మరియు ఆలయ సిబ్బంది అధర్వంలో నేడు 5/ 11 / 2025 కార్తీకమాసం కల్యాణమహోత్సవం అమృతగుందంలో గంగ హారతి మరియు దీప రాధన మహోత్సవ క్రాయక్రమము నిర్వహించడం జరిగింది
ఇట్టి కార్యక్రమం లో సమస్త భక్తులు అంత పాల్గొని తీర్త ప్రసాదలు స్వేకరించరు.
