క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు…

క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు

– ఎస్సై ఎం కాశినాథ్ యాదవ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ మార్చ్ 30: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ ప్రారంభం కావడంతో, క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జహీరాబాద్ రూరల్ ఎస్సై ఎం కాశీనాథ్ యాదవ్ మీడియా ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో యువత బెట్టింగ్ ఊబిలో పడి తమ జీవితాలను, కుటుంబాలను నాశనం చేసుకోవద్దని సూచనలు చేశారు. క్రికెట్ బెట్టింగ్ కారణంగా కుటుంబాలు రోడ్డున పడతాయని, అప్పుల పాలై, ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉందని ఎస్సై అన్నారు. బెట్టింగ్ రాయుళ్లపై, ముఖ్యంగా ఆన్‌లైన్ యాప్‌లు (టెలిగ్రామ్ , వాట్సాప్ , ఇంస్టాగ్రామ్ ) ద్వారా నిర్వహించే వారిపై ప్రత్యేక నిఘా ఉంచామని అక్రమాలకు పాల్పడితే పిడి యాక్ట్ వంటి కఠిన చట్టాల కింద చర్యలు తీసుకుంటామని బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై కూడా చర్యలు తీసుకుంటామని అన్నారు.యువత, విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలని, పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు కూడా నిఘా ఉంచాలని,మీ పరిసరాల్లో ఎవరైనా బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై కాశీనాథ్ యాదవ్ తెలిపారు.

బెట్టింగ్ ఊబిలో పడొద్దు.. బతుకు ఛిద్రం చేసుకోవద్దు…

బెట్టింగ్ ఊబిలో పడొద్దు.. బతుకు ఛిద్రం చేసుకోవద్దు

◆”–: ఐపిఎల్‌ ‌ప్రారంభంతో యువతకు ఎస్ఐ క్రాంతి కుమార్ ‌హెచ్చరిక

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గ, బెట్టింగ్‌ ఊబిలో పడొద్దు.. బతుకును ఛిద్రం చేసుకోవద్దని ఝరాసంగం పోలీస్ స్టేషన్ ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్ యువతను హెచ్చరించరు. ఐపీఎల్‌ ‌సీజన్‌ ‌మొదలవుతున్న తరుణంలో క్రికెట్‌ను కేవలం క్రీడగా ఆస్వాదించాలని, బెట్టింగ్‌ ఊబిలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారు. వందలాది యాప్‌లను ప్రభుత్వం నిషేధించినప్పటికీ, ఇప్పుడు టెలిగ్రామ్‌, ‌వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ‌వంటి సోషల్‌ ‌డియా వేదికగా ఈ దందా కొత్త రూపం దాల్చింది. కేవలం డబ్బు కోసం ఇటువంటి ప్రమాదకరమైన యాప్‌లను ప్రమోట్‌ ‌చేసే సోషల్‌ ‌డియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఆన్‌లైన్‌ ‌మాత్రమే కాకుండా ఫామ్‌ ‌హౌస్‌లు, రహస్య ప్రాంతాల్లో సాగే ఆఫ్‌లైన్‌ ‌బెట్టింగ్‌లపై మా ప్రత్యేక నిఘా ఉంటుందని ఎస్ఐ క్రాంతి కుమార్ ‌హెచ్చరించారు. బెట్టింగ్‌ ‌వల్ల అప్పులపాలై కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి తెచ్చుకోవద్దు.  పరిసరాల్లో ఎవరైనా బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్‌ 100 ‌సమాచారం ఇవ్వగలరని కోరారు. క్రికెట్‌ అభిమానులకు ఐపీఎస్‌-2026 ‌పండుగ మొదలైంది. శనివారం రాత్రి 07:30 గంటలకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా తొలి మ్యాచ్‌ ‌జరగనుంది. ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ‌చాంపియన్‌ ‌రాయల్‌ ‌చాలెంజర్స్ ‌బెంగళూరు, సన్‌రైజర్స్ ‌హైదరాబాద్‌ ‌తలపడనున్నాయి. ఐపీఎల్‌ 19‌వ సీజన్‌ ‌మే 31 వరకు నిర్వహించనున్నారు. ఈ లీగ్‌లో మొత్తంగా 10 జట్లు తలపడనుండగా.. 74 మ్యాచ్‌లు జరుగనున్నాయి. అయితే, ఐపీఎల్‌ అం‌టే గుర్తొచ్చే మరో విషయం బెట్టింగ్‌. ఈ ‌సమయంలో బెట్టింగ్‌ ‌రాయుళ్లు రెచ్చిపోతుంటారు. అమయాక యువతను లక్ష్యంగా చేసుకుని కోట్లు దండుకుంటుంటారు. ఐపీఎల్‌ ‌వేళ వందల కోట్ల రూపాయలు చేతులు మారుతుంటాయి. ఈ సందర్భంగా యువతకు ఎస్ఐ క్రాంతి కుమార్ ‌కీలక సూచనలు చేశారు. బెట్టింగ్‌ ఊబిలో పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. బెట్టింగ్‌ ‌వల్ల అప్పులు పెరిగి కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దాని జోలికి వెళ్లకుండా క్రికెట్‌ను కేవలం క్రీడగా మాత్రమే ఆస్వాదించాలని యువతకు పిలుపునిచ్చారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version