బెట్టింగ్ ఊబిలో పడొద్దు.. బతుకు ఛిద్రం చేసుకోవద్దు
◆”–: ఐపిఎల్ ప్రారంభంతో యువతకు ఎస్ఐ క్రాంతి కుమార్ హెచ్చరిక
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గ, బెట్టింగ్ ఊబిలో పడొద్దు.. బతుకును ఛిద్రం చేసుకోవద్దని ఝరాసంగం పోలీస్ స్టేషన్ ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్ యువతను హెచ్చరించరు. ఐపీఎల్ సీజన్ మొదలవుతున్న తరుణంలో క్రికెట్‌ను కేవలం క్రీడగా ఆస్వాదించాలని, బెట్టింగ్ ఊబిలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారు. వందలాది యాప్‌లను ప్రభుత్వం నిషేధించినప్పటికీ, ఇప్పుడు టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ డియా వేదికగా ఈ దందా కొత్త రూపం దాల్చింది. కేవలం డబ్బు కోసం ఇటువంటి ప్రమాదకరమైన యాప్‌లను ప్రమోట్ చేసే సోషల్ డియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఆన్‌లైన్ మాత్రమే కాకుండా ఫామ్ హౌస్‌లు, రహస్య ప్రాంతాల్లో సాగే ఆఫ్‌లైన్ బెట్టింగ్‌లపై మా ప్రత్యేక నిఘా ఉంటుందని ఎస్ఐ క్రాంతి కుమార్ హెచ్చరించారు. బెట్టింగ్ వల్ల అప్పులపాలై కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి తెచ్చుకోవద్దు. పరిసరాల్లో ఎవరైనా బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100 సమాచారం ఇవ్వగలరని కోరారు. క్రికెట్ అభిమానులకు ఐపీఎస్-2026 పండుగ మొదలైంది. శనివారం రాత్రి 07:30 గంటలకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. ఐపీఎల్ 19వ సీజన్ మే 31 వరకు నిర్వహించనున్నారు. ఈ లీగ్‌లో మొత్తంగా 10 జట్లు తలపడనుండగా.. 74 మ్యాచ్‌లు జరుగనున్నాయి. అయితే, ఐపీఎల్ అంటే గుర్తొచ్చే మరో విషయం బెట్టింగ్. ఈ సమయంలో బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతుంటారు. అమయాక యువతను లక్ష్యంగా చేసుకుని కోట్లు దండుకుంటుంటారు. ఐపీఎల్ వేళ వందల కోట్ల రూపాయలు చేతులు మారుతుంటాయి. ఈ సందర్భంగా యువతకు ఎస్ఐ క్రాంతి కుమార్ కీలక సూచనలు చేశారు. బెట్టింగ్ ఊబిలో పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. బెట్టింగ్ వల్ల అప్పులు పెరిగి కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దాని జోలికి వెళ్లకుండా క్రికెట్‌ను కేవలం క్రీడగా మాత్రమే ఆస్వాదించాలని యువతకు పిలుపునిచ్చారు.
