చలికాలంలో చర్మం పగుళ్లు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ.;.

చలికాలంలో చర్మం పగుళ్లు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?

 

చలికాలం వచ్చిందంటే చాలామందికి చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. శీతాకాలం గాలిలో తేమ తగ్గడం వల్ల చర్మం పొడిమారి పగుళ్లు ఏర్పడతాయి. ముఖ్యంగా పెదవులు, అరచేతులు, పాదాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

సాధారణంగా చలికాలం(winter) ఎంతో అహ్లాదంగా ఉంటుంది.. మనసుకు ఎంతో హాయినిస్తుంది. కాకపోతే ఈ సీజన్‌లో చర్మసమస్యలు (Skin problems) తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. గాలిలో తేమ(Moisture) తగ్గడం వల్ల చర్మం పొడిబారి పగుళ్లు ఏర్పడతాయి. చలికాలం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చర్మాన్ని మృదువుగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

3. శీతాకాలం(Winter)లో చర్మాని(Skin)కి తేమ అందించడం ఎంతో ముఖ్యంగా. స్నానం చేసిన మూడు నిమిషాలలోపే మాయిశ్చరైజర్ (Moisturization) లేదా బాడీ లోషన్ (Body lotion)చర్మానికి రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంలో తేమ కొంతసేపటి వరకు అలాగే ఉంటుంది. మాయిశ్చరైజర్‌కి నీటి శాతం ఎక్కువగా ఉండే లోషన్ల కన్నా, నూనె శాతం ఎక్కువగా ఉండే క్రీములు లేదా పెల్రోలియం జెల్లీ (Petroleum jelly) వంటి అయింట్‌మెంట్స్ మంచిది.

. స్నానం(Bath) చేసే సమయంలో మరీ వేడి నీళ్లు కాకుండా గోరువెచ్చని నీటితో చేయడం మంచిది. వేడి నీళ్లు(Hot water) చర్మంపై ఉండే నూనెలను తొలగించి మరింత పొడిబారేలా చేస్తుంది.. దాంతో దురదలు ఏర్పడే ప్రమాదం ఉంది. స్నానానికి చాలా వరకు కెమికల్స్ తక్కువగా ఉండే మైల్డ్ సోప్స్ (Mild soaps)లేదా బాడీలోష్ వాడటం మంచింది

5. వింటర్ సీజన్‌లో చాలా మంది తక్కువగా మంచినీళ్లు తాగుతుంటారు. అలా చేయడం మంచిది కాదు.. సాధ్యమైనంత వరకు నీటిని తీసుకోవాలి. అలా చేయడం వల్ల చర్మాన్ని లోపల నుంచి హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.

6. చలికాలంలో ఆహార పదార్ధా(Food items)ల విషయంలో కూడా చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒమేగా-3 (Omega-3)ఫ్యాటి యాసిడ్స్ అంటే బాదం, వాల్ నట్స్, చేపలు వంటి ఆహార పదార్థాలు చర్మం ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version