పరాటా చేయడం నేర్చుకున్నా…

పరాటా చేయడం నేర్చుకున్నా

విజయ్‌ సేతుపతి, నిత్యా మీనన్‌ జంటగా పాండిరాజ్‌ తెరకెక్కించిన చిత్రం ‘సార్‌ మేడమ్‌’. సెంథిల్‌ త్యాగరాజన్‌, అర్జున్‌ త్యాగరాజన్‌ నిర్మించారు. ఇటీవలె తమిళ్‌లో..

విజయ్‌ సేతుపతి, నిత్యా మీనన్‌ జంటగా పాండిరాజ్‌ తెరకెక్కించిన చిత్రం ‘సార్‌ మేడమ్‌’. సెంథిల్‌ త్యాగరాజన్‌, అర్జున్‌ త్యాగరాజన్‌ నిర్మించారు. ఇటీవలె తమిళ్‌లో విడుదలైందీ చిత్రం. ఈ శుక్రవారం తెలుగులో విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్‌ వేడుకలో విజయ్‌ సేతుపతి మాట్లాడుతూ ‘‘ఈ సినిమాకు తమిళ్‌లో మంచి విజయం దక్కింది. తెలుగులోనూ పెద్ద విజయం సాధిస్తుందని నమ్మకముంది. ఈ సినిమా కోసం పరాటా చేయడం నేర్చుకున్నాను. కథను నమ్మి చేసిన చిత్రమిది’’ అని అన్నారు. ‘‘ఇది యూనివర్సల్‌ సబ్జెక్ట్‌. అందరూ రిలేట్‌ చేసుకుంటారు’’ అని నిర్మాత త్యాగరాజన్‌ చెప్పారు. ‘‘ఇది ప్రేక్షకులకు మంచి హోమ్‌ ఫుడ్‌ లాంటి సినిమా’’ అని దర్శకురాలు నందినీ రెడ్డి తెలిపారు. ‘‘భార్యాభర్తల మధ్య జరిగే అందమైన ప్రేమకథ ఈ చిత్రం’’ అని పాండిరాజ్‌ అన్నారు.

నిత్యామీనన్‌తో.. ఇలాంటి సినిమా ఊహించలేదు

 

నిత్యామీనన్‌తో.. ఇలాంటి సినిమా ఊహించలేదు

 

విజయ్‌ సేతుపతి, నిత్యామేనన్ జంటగా నటించిన చిత్రం ‘తలైవన్‌ తలైవి’ తెలుగులో స‌ర్ మేడ‌మ్ గా విడుద‌ల అవుతోంది.

 

అన్ని పాత్రలను అందరు హీరోలు చేయలేరని, కానీ ఒక్క విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) మాత్రం అన్ని పాత్రలను అవలీలగా పోషించగలరని దర్శకుడు పాండిరాజ్ (Pandiraaj) పేర్కొన్నారు. ఆయన దర్శకత్వం వహించగా విజయ్‌ సేతుపతి, నిత్యామేనన్ (Nithya Menen) జంటగా నటించిన చిత్రం ‘తలైవన్‌ తలైవి’ (Thalaivan Thalaivii) ఈ నెల 25వ తేదీన విడుదల కానుంది. సీనియర్‌ నిర్మాత ఎస్‌.త్యాగరాజన్‌ సమర్పణలో సత్యజ్యోతి ఫిలిమ్స్‌ పతాకంపై సెంథిల్‌ త్యాగరాజన్‌, అర్జున్‌ త్యాగరాజన్‌ నిర్మించారు. తెలుగులో స‌ర్ మేడ‌మ్ ( Sir Madam)గా విడుద‌ల అవుతోంది.

 

ఇటీవల జరిగిన మూవీ ట్రైలర్‌ కార్యక్రమంలో నిర్మాత త్యాగరాజన్‌ మాట్లాడుతూ, ‘మూడు తరాలుగా సినిమా నిర్మాణంలో కొనసాగుతున్నామని, అప్పటి నుంచి ఇప్పటివరకు ఆదరిస్తున్న ప్రేక్షకులకు, మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇది పక్కా ఫ్యామిలీ చిత్రం’ అన్నారు. చిత్ర దర్శకుడు పాండిరాజ్‌ మాట్లాడుతూ, ‘సాధారణంగా హీరో క్యారెక్టర్‌ అంటే.. దానికంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది. కానీ, ఈ చిత్రంలో అలాంటిదేదీ లేదు. సినిమా చూస్తే మీరే గ్రహిస్తారు. ‘ఆకాశ వీరన్‌’ అనే పాత్రలో విజయ్‌ సేతుపతి మాత్రమే జీవించగలడు. అందుకే హీరోగా ఆయనను ఎంపిక చేశాం’ అన్నారు.

హీరో విజయ్‌ సేతుపతి మాట్లాడుతూ, ‘మూడు తరాలుగా చిత్ర నిర్మాణంలో కొనసాగుతున్న సత్యజ్యోతి వంటి సంస్థలో పనిచేడం గర్వంగా ఉంది. దర్శకుడు పాండిరాజ్‌ ఎప్పటినుంచో తెలుసు. హీరోయిన్‌ నిత్యామేనన్‌తో కలిసి ఇలాంటి కథలో నటిస్తామని ఊహించలేదు. ఒక సినిమా నిర్మించడమంటే వంట చేయడంతో సమానం. వంట పూర్తయ్యాక దాన్ని ఆరగించి ఎలా ఉందో చెప్పాల్సింది ప్రేక్షకులు, మీడియానే. సినిమా నిర్మాణంతో మా పని పూర్తవుతుంది. ఫలితం మీ చేతుల్లో ఉంది. దాని కోసం ఎదురు చూస్తున్నాం’ అన్నారు. నిత్యామేనన్‌ మాట్లాడుతూ, ‘ఈ చిత్రంలో నటించడం నా జీవితంలోనే ఎంతో సంతోషాన్ని ఆస్వాదిస్తున్నాను. ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది’ అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version