మృత్యువులా వచ్చిన ట్రాక్టర్ ట్రాక్టర్.. వృద్ధ మహిళా మృతి.
అనంతగిరి, నేటి ధాత్రి:
ట్రాక్టర్ ఢీకొని వృద్ధ మహిళ మృతి చెందిన ఘటన మంగళవారం ఖానాపురం గ్రామంలో కనగాల రామకోటమ్మ సుబ్బయ్య (72) అనే వృద్ధురాలు ఇంటి నుండి వీధిలోకి వెళ్తుండగా ఇసుక ట్రాక్టర్ టీఎస్-29 టిబి-3770/3922 ను నడుపుతున్న డ్రైవర్ తన ట్రాక్టర్ ను అతివేగంగా అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా రివర్స్ చేసి వెళ్తున్న క్రమంలో మృతురాలైన రామకోటమ్మ ను ఢీ కొట్టి తన పై నుండి ట్రాక్టర్ ట్రాలీను పోనివ్వగా మృతురాలి తల పై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి. ట్రాక్టర్ డ్రైవర్ పల్లపు నాగరాజు హనుమంతు పై మృతురాలి కొడుకు కనగాల శేషయ్య ఫిర్యాదు పై అనంతగిరి ఏ ఎస్సై సిహెచ్ లింగారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
