ఏళ్ల బాలికపై అత్యాచారం.. పుట్టిన గంట తర్వాత ఆ బిడ్డ..

 ఏళ్ల బాలికపై అత్యాచారం.. పుట్టిన గంట తర్వాత ఆ బిడ్డ..

 

 

అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేయగా బాలిక ఏడు నెలల గర్భంతో ఉన్నట్లు తేలింది. ఇక, అదే రోజు బాలికను తల్లిదండ్రులు డిస్ట్రిక్ట్ ఉమెన్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ బాలిక ఓ బిడ్డకు జన్మనిచ్చింది.

ఉత్తర ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. 31 ఏళ్ల ఓ వివాహితుడు 11 ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారం చేశాడు. అతడి కారణంగా బాలిక గర్భం దాల్చింది. ఏడు నెలలకే డెలివరీ అయింది. పుట్టిన బిడ్డ గంట తర్వాత ప్రాణాలు విడిచింది. పోలీసులు, బాలిక అన్న చెప్పిన వివరాల మేరకు.. బరేలీ జిల్లాలోని నవాబ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన 31 ఏళ్ల రషీద్‌కు పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇంటి దగ్గరలో నివసించే 11 ఏళ్ల బాలికపై అతడి కన్నుపడింది. తినడానికి పండ్లు ఇస్తానని చెప్పి బాలికను ఇంటికి తీసుకెళ్లాడు. తర్వాత అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇది ఎనిమిది నెలల క్రితం జరిగింది. ఇక అప్పటి నుంచి బాలికను భయపెట్టి తరచుగా అత్యాచారం చేస్తూ ఉన్నాడు. గురువారం బాలిక తీవ్ర కడుపునొప్పికి గురైంది. తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు.

అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేయగా బాలిక ఏడు నెలల గర్భంతో ఉన్నట్లు తేలింది. ఇక, అదే రోజు బాలికను తల్లిదండ్రులు డిస్ట్రిక్ట్ ఉమెన్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ బాలిక ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఏడు నెలల్లోనే పుట్టడంతో గంట తర్వాత బిడ్డ చనిపోయింది. బాలిక పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగుపడుతోంది. డెలివరీకి ముందు బాలిక రషీద్ పేరును కుటుంబసభ్యులకు చెప్పింది. వారు పోలీస్ స్టేషన్‌లో అతడిపై కేసు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శనివారం అతడ్ని అరెస్ట్ చేశారు.

చనిపోయిన బిడ్డనుంచి డీఎన్ఏ సాంపిల్స్ సేకరించి టెస్ట్‌కు పంపారు. ఈ సంఘటనపై నవాబ్ గంజ్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అరుణ్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ‘అత్యాచారం గురించి బయటకు చెబితే ఇంట్లో వాళ్లను చంపేస్తానని రషీద్ బాలికను బెదిరించాడు. వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేశాడు. పలుమార్లు అత్యాచారం చేశాడు. శుక్రవారం రషీద్‌పై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. బిడ్డ, రషీద్ నుంచి డీఎన్‌ఏ సాంపిల్స్ సేకరించి టెస్టుకు పంపాము’ అని తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version