గుండంపల్లిలో నవోదయ విజేతకు ఘన సన్మానం….

గుండంపల్లిలో నవోదయ విజేతకు ఘన సన్మానం
మల్లాపూర్ మార్చి 24 నేటి ధాత్రి

ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ నవోదయ ప్రవేశపరీక్షలో విజయాన్ని సాధించిన గుండంపల్లి గ్రామానికి చెందిన జక్కుల నవదీప్‌ను జువ్వాడి కృష్ణారావు ఘనంగా సన్మానించారు.
గుండంపల్లి గ్రామం నుండి తొలిసారిగా నవోదయ సీటు సాధించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నవదీప్ సాధించిన విజయాన్ని గ్రామ ప్రజలు అభినందిస్తూ, అతని భవిష్యత్తు మరింత ఉజ్వ లంగా ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దప్పుల పద్మనర్సయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ అంతడ్పుల పుష్పలతనర్సయ్య, బెజ్జరపు శ్రీనివాస్, మాజీ సర్పంచ్ మామిడి లక్ష్మారెడ్డి, గంగాధర్,మధు గంగారెడ్డి, తిరుపతి, గంగరాజం, నరేష్ విజయ్, క్రాంతి, కిరణ్, దినేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version