పచ్చని చిగురులు ప్రకృతికి వెలుగులుపూల అందాలతో మరింత అలంకారం

పచ్చని చిగురులు ప్రకృతికి వెలుగులుపూల అందాలతో మరింత అలంకారం

పరకాల,నేటిధాత్రి

వేసవి ప్రారంభంతోనే ప్రకృతి మళ్లీ పచ్చని వర్ణాలతో కళకళలాడుతోంది.పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో చెట్లు కొత్తగా చిగురించడం ప్రారంభించడంతో పరిసరాలు ఆహ్లాదకరంగా మారాయి.ఎండ తీవ్రత పెరుగుతున్న ఈ కాలంలో చెట్లపై వెలసిన పసిడి-పచ్చని ఆకులు ప్రకృతికి ప్రత్యేక ఆకర్షణను తీసుకొస్తున్నాయి.ఉదయం,సాయంత్రం వేళల్లో ప్రజలు బయటకు వచ్చి ఈ సహజ సోయగాలను ఆస్వాదిస్తున్నారు.ముఖ్యంగా రోడ్ల వెంట చిగురించిన చెట్లు పర్యావరణానికి శోభను చేకూరుస్తున్నాయి.పక్షుల కిలకిలారావాలు,తేలికపాటి గాలులు కలిసిన ఈ దృశ్యం మరింత మనోహరంగా మారుతోంది.ఇదిలా ఉండగా,రంగురంగుల పూలతో రోడ్లకు ఇరువైపులా పువ్వుల అందాలు విరబూస్తూ ప్రయాణికుల కనులకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి.పూల సువాసనలు,పచ్చని చెట్ల మధ్య కలిసిన ఈ వాతావరణం ప్రకృతిని మరింత సుందరంగా మార్చుతోంది.గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులా చిగురించిన చెట్లు పల్లె అందాన్ని మరింత పెంచుతున్నాయి.ఈ పచ్చదనం ప్రయాణికులకు చల్లని అనుభూతిని కలిగిస్తూ సహజ వాతావరణాన్ని ప్రతిబింబిస్తోంది.ప్రకృతి అందాలను కాపాడుకోవాలంటే చెట్ల సంరక్షణపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పర్యావరణ ప్రేమికులు సూచిస్తున్నారు. వేసవిలో చెట్లకు తగినంత నీరు అందించడం,కొత్త మొక్కలు నాటడం ద్వారా పచ్చదనాన్ని మరింత విస్తరించవచ్చని వారు పేర్కొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version