చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామానికి చెందిన నారా సుహాసిని అనారోగ్యంతో మృతి..
*నారా సుహాసిని పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే పులివర్తి నాని
చంద్రగిరి(నేటిధాత్రి
చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామానికి చెందిన నారా ప్రశాంత్ తల్లి నారా సుహాసిని మృతి చెందిన విషయం స్థానిక నాయకులు ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే పులివర్తి నాని వారితో కలిసి ఆమె పార్థివదేహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యంగా ఉండాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
