జిల్లా కలెక్టర్ అకస్మిక తనిఖీలు
కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలం మైలా రం గ్రామంలో జిల్లా కలెక్టర్ అకస్మిక తనిఖీలు చేశారు తనిఖీల్లో భాగంగా వంద రోజుల పని దినాలు చేసే వారితో మాట్లాడడం,హాజరు పట్టిక గురించి పరిశీలన చేశారు. వందరోజుల పని దినాలకు రాని వారి గురించి అడిగి తెలుసుకున్నారు. పని చేసేవారు లోను తీసు కోవడం జరుగుతుందా! లేదా! అని ప్రశ్నించారు. సంఘం యొక్క మీటింగ్ లు నెల నెల జరుగు తున్నాయా లేదా! అడిగి తెలుసుకున్నారు.మహిళలతో ముచ్చటిస్తూ వారి యొక్క బాధలను అడగడం జరిగింది.
జిల్లా కలెక్టర్ ను నూతన సర్పంచ్ సన్మానించారు. తర్వాత గ్రామపంచాయతీ పరిసర ప్రాంతాలను, అంగ న్వాడి కేంద్రాలను పరిశీలించి రిజిస్టర్లు,బాలింతలకు సరఫ రా చేసే ప్రక్రియ, హాజరు పట్టిక గురించి, అంగన్వాడి కేంద్రం లో పిల్లలకు అందిస్తున్న పౌష్టిక ఆహారం గురించి ఆరా తీశారు ప్రభుత్వ పాఠశాలను సందర్శించి పిల్లలతో సంభా షణలు చేసి, గదులు, మధ్యా హ్న భోజనం పథకం, టాయి లెట్స్ పరిశీలించారు మం డల కేంద్రంలోని ఎంజెపి ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేశారు
చెరువు మట్టిని పంట పొలాలకు తోలుకోవడానికి అనుమతి
శాయంపేట మండలం మైలా రం గ్రామంలోని 100 రోజుల పని దినాలకు వచ్చిన రైతులు పంటపొలాల సారవంతాన్ని పెంచడానికి చెరువులు కుం టల నుండి పూడిక మట్టిని తోలుకపోవడానికి అనుమతి ఇవ్వాలని రైతులు కోరారు. రైతు మాట్లాడుతూ నల్లమట్టి తీసే క్రమంలో ప్రభుత్వానికి ఎంత కట్టాలో అది మేము కడతాం.ఒక ఎకరానికి 10 ట్రాక్టర్లు తోలుకపోవడానికి చూసి అధికారులు అడ్డుకుం టున్నారు. ట్రాక్టర్లు, జేసీపి పట్టుకొని ఇబ్బందికరం చేస్తు న్నారని రైతులు ఆరోపిం చారు.కాబట్టి మాకు ఈ సహకారం చేయాలని కలెక్టర్ ను రైతులు కోరారు.
మండల కేంద్రంలో ఎంజె పి ప్రభుత్వ పాఠశాల తనిఖీ
మండల కేంద్రంలోని ఎంజెపి ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా విద్యార్థుల బోధన ప్రక్రియను అడిగి తెలు సుకుని, తాజా కూరగాయలు వినియోగించుకోమని ఆహార పదార్థాలు కలుషితం కాకుం డా చూసుకోవాలని నిర్వా హలకు ఆదేశించారు. విద్యా ర్థులకు మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం అందించాలనిసూచిం చారు వంట గదిని, సిబ్బంది వివరాలు, పాఠశాలలో టాయి లెట్లు, నీటి వసతి, బోధన ప్రక్రియను అడిగి తెలుసు కున్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీవో, ఎమ్మా ర్వో ఎంపీడీవో, గ్రామ పంచాయతీ కార్యద ర్శులు, గ్రామపంచాయతీ సిబ్బంది, అన్ని శాఖల ప్రభుత్వాధికారులు పాల్గొ న్నారు
