ఎన్నికలలో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి
◆:- ఎమ్మార్పీఎస్ న్యాల్కల్ మండల ఇంచార్జ్ జై రాజ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
వికలాంగులుచేయూత పింఛన్ దారుల మహా ధర్నా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు గ్రామపంచాయతీ ముట్టడి కార్యక్రమంలో బుధవారం రోజు న్యాల్కల్ మండలంలోని న్యామ్ తాబాద్ పంచాయతీ, కార్యాలయమును ఎమ్మార్పీఎస్ న్యాల్కల్ ఇన్చార్జి జైరాజ్ మాదిగ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు అనంతరం వినతి పత్రం ఇవ్వడం జరిగింది వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలు చేనేత గీత హెచ్ఐవి కండరాల క్షీణతతో బాధపడుతున్నటువంటి వారికి వెంటనే పింఛన్లు పెంచాలని నూతన పింఛన్లు మంజూరు చేయాలని పంచాయతి కార్యదర్శి తిరుపతి కి వినతిపత్రం లో డిమాండ్ చేశారు. ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా వృద్ధులు ఒంటరి మహిళలు చేనేత గీత కార్మికులకు 4000 మరియు వికలాంగులకు 6000 కండరాల క్షణక్షతో బాధపడుతున్నటువంటి వారికి 15000 ఇవ్వాలని వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఎం ఆర్ పి ఎస్ నాయకులు శరణప్ప గ్రామ ప్రజల పేర్లు రత్నమ్మ సంగప్ప రంగమ్మ సుదీర్ తమ్మ వికలాంగులు వృద్ధుల వితంతువుల ఒంటరి మహిళలు తదితరులు పాల్గొన్నారు.