తల్లి పేరు తో ఒక మొక్క నాటవలెను
ఎంపీడీవో మహమ్మద్ సలీం
ఇబ్రహీంపట్నం, నేటిధాత్రి
జన్మనిచ్చిన కన్నతల్లి పేరు తో ప్రతి ఒక్కరు మొక్కను నాటి అది వృక్షమయ్యే వరకు సహకరించాలి ని ఇబ్రహీంపట్నం ఎంపీడీవో మహమ్మద్ సలీం తెలిపారు తల్లి పేరున ఒక మొక్క నాటే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలంలోని కోమటి కొండాపూర్ మరియు వర్షకొండ గ్రామాలలో పాల్గొని మొక్కలు నాటడం జరిగింది ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలలో కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళుతున్నట్లుగా మరియు సంబంధిత గ్రామ ప్రజలందరూ కూడా వారికి అన్వైనటువంటి స్థలాలలో వారికి జన్మనిచ్చినటువంటి తల్లి పేరున మొక్కలు నాటి సంరక్షించుకోవడం వలన రాబోయే తరానికి మంచి ఆరోగ్యవంతమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసిన వారవుతారని తెలిపారు ఈ కార్యక్రమంలో జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు రాజేందర్ మరియు పంచాయతీ కార్యదర్శి సరిత ప్రవీణ్ ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ వినోద్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.