ప్రజలను ఇబ్బంది పెడుతున్న మీసేవ కేంద్రం
మందమర్రి నేటి ధాత్రి
మంచిర్యాల జిల్లా మందమర్రి పాత బస్టాండ్ ఏరియాలోని మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో ఉన్న మీ (ఈ) సేవ కేంద్రం మేనేజర్ ఉపేందర్ ఇంచార్జి జనార్ధన్ గార్లు మందమర్రి పట్టణ ప్రాంత ప్రజలకు పౌర సౌకర్యాల సేవల నిమిత్తం మీ సేవ కేంద్రానికి వస్తున్న విద్యార్థులను, యువకులను, వృద్ధులను, అవహేళన చేస్తూ, ప్రజలతో దురుసుగా ప్రవర్తిస్తూ, ప్రజలకు తెలియని విషయాలు సలహా సూచనలు ఇవ్వకపోక వారినీ బెదిరిస్తూ , సమయపాలన పాటించకుండా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న తరుణంలో మీ సేవ మేనేజర్ ఉపేందర్ ఇంచార్జి జనార్ధన్ గార్ల పై తక్షణమే చర్యలు తీసుకోవాలని మంచిర్యాల కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ గారికి మందమర్రి పట్టణ అఖిల పక్ష పార్టీ నాయకులు, యువ నాయకులు ,సోషల్ మీడియా వారియర్స్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగింది. కలెక్టర్ దీపక్ కుమార్ గారు సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటాము అని హామీ ఇవ్వడం జరిగింది…ఈ కార్యక్రమంలో పట్టణ అఖిల పక్ష పార్టీ నాయకులు, ,యువ నాయకులు, ఆకారం రమేష్, బండి శంకర్,సతీష్, కత్తి రమేష్, సొత్కు ఉదయ్,సిపేల్లి సాగర్, రాయబారపు కిరణ్, చిప్పకుర్తి శశిధర్, మహేష్, తదితరులు పాల్గొన్నారు…
