చలివాగు చెక్ డ్యాం పై నుండి పడిన వ్యక్తి మృతి
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలం కొప్పుల గ్రామానికి చెందిన బండి భాస్కర్ తన కులవృత్తి చలి వాగులోకి నిన్న సాయం త్రం నాలుగు గంటల సమయంలో చేపలు పట్టడానికి వెళ్తున్నా అని చెప్పి వెళ్లడం జరిగింది. అదే రోజు సాయం త్రం 6 గంటల సమయంలో గ్రామ వాసి అయిన తోటి మత్స్యకా రులు కిరణ్, నా భర్త చలివాగు చెక్ డ్యామ్ వద్ద నీటిలో పడి మునిగి ఉండడం చూసి ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు తెలపడంతో హుటాహుటిన అక్కడికి వెళ్లడం జరిగింది ప్రమాదవశాత్తు కాలుజారి చలివాగు చెక్ డాం పై నుండి కింద పడడంతో తలకు బల మైన గాయాలు అయి నీటిలో మునిగి మరణించడం జరి గింది. నా భర్త మరణం పై మాకు ఎవరి మీద ఎలాంటి అనుమానాలు లేవని నా భర్త శవాన్ని శవ పంచనామా జరిపి శవాన్ని అప్పగించాలని కోరడ మైనది.