ఈక్విటీ క్యాష్‌ మార్కెట్లో సీఏఎ్‌సకు కొత్త నియమావళి

 ఈక్విటీ క్యాష్‌ మార్కెట్లో సీఏఎ్‌సకు కొత్త నియమావళి

 

ఈక్విటీ క్యాష్‌ మార్కెట్లో క్లోజింగ్‌ యాక్షన్‌ సెషన్‌ (సీఏఎ్‌స)కు సెబీ కొత్త నియమావళిని ప్రతిపాదించింది. దశల వారీగా అమలు చేయనున్న కొత్త విధానంలో తొలుత అధిక లిక్విడిటీ కలిగిన డెరివేటివ్‌ స్టాక్స్‌ ముగింపు ధరను నిర్ణయించనున్నారు….

ఈక్విటీ క్యాష్‌ మార్కెట్లో క్లోజింగ్‌ యాక్షన్‌ సెషన్‌ (సీఏఎ్‌స)కు సెబీ కొత్త నియమావళిని ప్రతిపాదించింది. దశల వారీగా అమలు చేయనున్న కొత్త విధానంలో తొలుత అధిక లిక్విడిటీ కలిగిన డెరివేటివ్‌ స్టాక్స్‌ ముగింపు ధరను నిర్ణయించనున్నారు. తద్వారా గడించే అనుభవం ఆధారంగా అన్ని స్టాక్స్‌కు ఈ విధానాన్ని వర్తింపజేయాలని సెబీ ప్రతిపాదించింది. మార్కెట్లో ఒడుదుడుకులు తగ్గించేందుకు, పారదర్శకత పెంచేందుకు, పెద్ద ఇన్వెస్టర్లు సులువుగా ట్రేడింగ్‌ చేపట్టేందుకు ఇది దోహదపడవచ్చని సెబీ భావిస్తోంది. ఏదైనా షేరు ముగింపు ధరను నిర్ణయించేందుకు చివర్లో నిర్వహించే స్వల్పకాలిక ట్రేడింగ్‌ సెషనే సీఏఎస్‌. గతంలో ప్రతిపాదించిన 3.30-3.45 గంటల మధ్య 15 నిమిషాల పాటు కాకుండా ఈ సెషన్‌ను 3.15-3.35 గంటల మధ్య 20 నిమిషాల పాటు నిర్వహించాలని సెబీ తాజాగా ప్రతిపాదించింది.

 

బ్లాక్‌ డీల్‌ విండో ద్వారా చేపట్టే ట్రేడింగ్‌ కనీస ఆర్డర్‌ సైజును ప్రస్తుత రూ.10 కోట్ల నుంచి రూ.25 కోట్లకు పెంచాలని సెబీ ప్రతిపాదించింది. ప్రస్తుత పరిమితి 2017 నుంచి కొనసాగుతోంది. స్టాక్‌ ఎక్స్ఛేంజీలో కొనుగోలుదారు, విక్రేత మధ్య ఒకే లావాదేవీ ద్వారా భారీ సంఖ్యలో జరిగే షేర్ల విక్రయాన్నే బ్లాక్‌ డీల్‌ అంటారు. స్టాక్‌ ఎక్స్ఛేంజీలు రోజులో రెండుసార్లు కల్పించే 15 నిమిషాల ప్రత్యేక ట్రేడింగ్‌ విండో ద్వారానే ఈ బ్లాక్‌ డీల్స్‌ చేపట్టేందుకు వీలుంటుంది. ఇందుకోసం ఎక్స్ఛేంజీలు ఉదయం 8.45-9 గంటల మధ్య, మధ్యాహ్నం 2.05-2.20 గంటల మధ్య మరో సెషన్‌ను నిర్వహిస్తాయి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version