కౌన్సిలర్ వినయ్ రెడ్డి జన్మదిన వేడుకలు

కౌన్సిలర్ వినయ్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు

కేసముద్రం/ నేటి ధాత్రి

 

కేసముద్ర మున్సిపాలిటీ 7వ వార్డు కౌన్సిలర్ రావుల వినయ్ రెడ్డి 33 వ జన్మదిన వేడుకలు మండల బిఆర్ఎస్ పార్టీ కార్యాలయ ఆవరణలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. అనంతరం వినయ్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ మృదుస్వభావి తన ప్రజలకు అత్యంత సన్నిహితంగా ఉంటూ ప్రజా ఆదరణ పొందుతూ ప్రజల కష్టాల్లో పాలు పంచుకుంటూ తనకంటూ ఒక విజన్ ఏర్పరచుకున్న వ్యక్తిగా అతి తక్కువ సమయంలో గుర్తింపు తెచ్చుకున్న మంచి రాజకీయ భవిష్యత్తు ఏర్పాటు చేసుకుంటూ ముందుకు పోతున్న రావుల వినయ్ రెడ్డికి తన పుట్టినరోజు సందర్భంగా పార్టీ నాయకులు మాజీ జడ్పిటిసి రావుల శ్రీనాథ్ రెడ్డి, మండల పార్టీ కార్యదర్శి కముటం శ్రీనివాస్, మాసాడి శ్రీనివాస్, మేకల సురేష్, తోట శ్రీనివాస్ మాజీ సర్పంచ్ ప్రభాకర్, కొమ్ము రాహుల్, కముటం శ్రీరంగం నాగుల్ పాషా, బి ఆర్ ఎస్ పార్టీ కౌన్సిలర్లు హరి నాయక్,పాయిరాల శరత్, ఆగే రాము, దూదేపాక కృష్ణ, రమేష్ పార్టీ అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version