ఇందిర మహిళ శక్తి సంబరాలలో కళాజాత బృందాల ప్రచారాలు
ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:
ఓదెల మండల కేంద్రం లో గురువారం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇందిరా మహిళా శక్తి సంబరాలల్లో భాగంగా ప్రభుత్వ కళాజాత బృందాలు ప్రచారాన్ని చేపట్టారు. ప్రభుత్వం మహిళా సంఘాలకు ఇస్తున్న వడ్డీలేని రుణాలతోపాటు మహిళలకు ప్రమాద బీమా, కుట్టు మిషన్ కేంద్రాలు, సోలార్ ప్లాంట్స్, పెట్రోల్ పంపులు ,ఆర్టీసీ బస్సులు ,మార్కెట్ సెంటర్లు ,15 సంవత్సరాలు పైబడిన వారితోపాటు వృద్ధులను, వికలాంగులను మహిళా సంఘాలలో చేరచుటకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తున్న తరుణంలో వారిని సంఘ సభ్యులుగా చేర్పించడం పై మహిళా శక్తి ప్రత్యేక కృషి చేస్తుందని కళాజాత ప్రచార బృందాలు ప్రజలకు అవగాహన కల్పించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రం నుండి ప్రభుత్వ కళాజాత ప్రచార బృందాలు మండల కేంద్రం ఓదెలలో ఇందిరా మహిళ. శక్తి సంబరాలు పై ప్రజలకు పూర్తిస్థాయిలో ఆహ్వాన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఏపిఏం లతా మంగేశ్వరి తో పాటు సీసీలు దొడ్డ విజయ, మారెళ్ళ శ్రీనివాస్, మండల సమైక్య కార్యదర్శి అనూష విఓఏలు అనిత, రమ,ప్రణీత, పద్మ, లావణ్య లతోపాటు మహిళా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.