టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ సభ్యులుగా తోట శ్రీనివాస్…

టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ సభ్యులుగా తోట శ్రీనివాస్

భూపాలపల్లి నేటిధాత్రి

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ భూపాలపల్లి జిల్లా కమిటీ సభ్యులుగా తోట శ్రీనివాస్ ఎంపికయ్యారు. గురువారం జిల్లా కేంద్రంలో జరిగిన టిడబ్ల్యూజెఎఫ్ జిల్లా కమిటీ సమావేశానికి జిల్లా అధ్యక్షులు ఎర్రం సతీష్ కుమార్ అధ్యక్షత వహించగా రాష్ట్ర కార్యదర్శి బి.దయాసాగర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ ను జిల్లా కమిటీ సభ్యులు గా ప్రకటించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గుజ్జ సారేశ్వరరావు,జాతీయ కౌన్సిల్ సభ్యులు కొలుగూరి సంజీవరావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చింతల కుమార్ యాదవ్, గాదె రమేష్, రోంటా ల శంకర్,జిల్లా ఉపాధ్యక్షులు ములకల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version