హుగ్గెల్లిలో ఘనంగా 154వ పల్లె సంకీర్తన
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ మండలం హుగ్గెల్లి గ్రామంలో ఆ గ్రామ హరేకృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో ఆదివారం 154వ పల్లె సంకీర్తన ఘనంగా జరిగింది. గ్రామ ప్రధాన దేవాలయం శ్రీ ఆంజనేయ స్వామి మందిరం నుండి శోభాయాత్ర ప్రారంభమై గ్రామ ప్రధాన వీధుల గుండా సాగింది. హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే అంటూ నినందిస్తూ భక్తి శ్రద్దలతో కీర్తనలు ఆలపించారు. చిన్నారులు, మహిళలు, పురుషులు సాంప్రదాయ వస్త్రధారణ ధరించి భక్తి పూర్వకంగా ఈ శోభయాత్రలో పాల్గొన్నారు. గ్రామ ప్రధాన కూడళ్ళలో భక్తులు చేసిన నృత్యాలు ఆహుతులను ఆకట్టుకొన్నాయి. అనంతరం జహీరాబాద్ స్వస్తిక్ రెస్టారెంట్ యాజమాన్యం ప్రసాద వితరణ జరిపారు.
