జేఈఈ మెయిన్స్ ఫలితాలలో ఎన్ ఆర్ ఎస్
జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించిన విద్యార్థులు : అభినందించిన యాజమాన్యం
కోదాడ, నేటి ధాత్రి:
జేఈఈ మెయిన్స్ ఫలితాలలో కోదాడ పట్టణానికి చెందిన ఎన్ ఆర్ ఎస్ కాలేజీ విద్యార్థులు తమ ప్రభంజనాన్ని చాటి చెప్పారు. తమ కాలేజ్ చెందిన సుమారు 50 మంది విద్యార్థులు జాతీయస్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశాలకు అర్హత సాధించడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా కాలేజ్ చైర్మన్ వడ్డే రాజేష్ చౌదరి అన్నారు.జాతీయస్థాయిలో కాలేజీ కు చెందిన తొండపు దీపిక 438, గాదె జస్వంత్ 540, బి. విజయ్ 2952, బి.రేవంత్ 8231, జె. సుధాకర్ 10843, ఆర్. కార్తీక్ 14410, యారబోలు. శరణ్య 15220, బీ. శిరీష 17337, పొందూరి అమృత సుధావర్షిణి 28547 ర్యాంకులు సాధించినట్లు కాలేజ్ యాజమాన్యం తెలిపింది. ఈ సందర్భంగా మంగళవారం కాలేజీలో జరిగిన కార్యక్రమంలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను కాలేజ్ చైర్మన్ వడ్డే రాజేష్ చౌదరి, డైరెక్టర్ మనోహర్ రెడ్డి, కరస్పాండెంట్ వేణుగోపాలరావు, ప్రిన్సిపల్ జీ వీ, వైస్ ప్రిన్సిపల్ పీ ఎన్ ఆర్ లు అభినందించి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో క్యాంపస్ ఇంచార్జిలు ప్రవీణ్ , మౌనిక, ఇతర లెక్చరర్లు సిబ్బంది అభినందించారు.
