జేఈఈ మెయిన్స్ ఫలితాలలో రేస్ ప్రభంజనం.

జేఈఈ మెయిన్స్ ఫలితాలలో రేస్ ప్రభంజనం.

కళాశాల చైర్ పర్సన్ బాణాల వసంత రెడ్డి

కోదాడ, నేటి ధాత్రి:

జేఈఈ మెయిన్స్ సెషన్- 2 ఫలితాలను సోమవారం ఎన్ టి ఏ విడుదల చేసింది.ఈ ఫలితాలలో కోదాడ పట్టణంలో రేస్ ఐఐటి మెడికల్ అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ర్యాంకులు సాధించారు. కళాశాలకు చెందిన మొక్క చరణ్ సాయి 99.56 పర్సంటైల్ సాధించి జాతీయస్థాయిలో 1583,చిలుకూరు భాను శంకర్ 98.76 పర్సంటైల్ 5225, ఐ. కృష్ణ చరణ్ 97.25 పర్సంటైల్ సాధించి 6274 ర్యాంకులు సాధించారు. కళాశాలకు చెందిన విద్యార్థులు వివిధ కేటగిరి విభాగాలలో గుండ్లపల్లి రమ్యశ్రీ (ఈడబ్ల్యూఎస్) 431, చింతకాయల కార్తీక్1489 (ఓ బి సి), బానోతు గణేష్6148 , ఎం .సంజీవ్ 9132లు జాతీయస్థాయిలో ర్యాంకులు సాధించారు. కళాశాలకు చెందిన 100 మంది విద్యార్థులు .అడ్వాన్స్డ్ కు అర్హత సాధించారు. జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు  రేస్ విద్యాసంస్థల చైర్మన్ బాణాల వసంత రెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీల, ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ పరీక్షల్లో తమ అకాడమీ విద్యార్థులు ప్రతిభ కనబరచడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు.  కాలేజీలో సరైన శిక్షణ, విద్యార్థుల పట్ల ప్రత్యేక దృష్టి అధ్యాపకుల మార్గదర్శకత్వం వలన ఈ ఫలితాలు సాధించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version