దుబాయ్, కువైట్ ఎయిర్ పోర్టులపై ఇరాన్ డ్రోన్ల దాడి…

దుబాయ్, కువైట్ ఎయిర్ పోర్టులపై ఇరాన్ డ్రోన్ల దాడి

అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం రోజురోజుకు ముదురుతుంది. ఈ దేశాల మధ్య ఘర్షణ కారణంగా గల్ఫ్ ప్రాంతాలు విలవిల్లాడుతున్నాయి. తాజాగా దుబాయ్, కువైట్ ఎయిర్ పోర్టులపై ఇరాన్ డ్రోన్లతో దాడులు చేసింది.

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం రోజురోజుకు ముదురుతుంది. ఈ దేశాల మధ్య ఘర్షణ కారణంగా గల్ఫ్ ప్రాంతాలు విలవిల్లాడుతున్నాయి. అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ పశ్చిమాసియా దేశాలపై డ్రోన్లతో దాడులు చేస్తోంది. ఇప్పటికే యూఏఈ, బహ్రెయిన్ వంటి పలు దేశాలపై ఇరాన్ దాడులు చేసింది. ఈ క్రమంలో తాజాగా కువైట్, దుబాయ్ విమానాశ్రాయలపై కూడా ఇరాన్ దాడులు చేయడంతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.
కువైట్, దుబాయ్ ఎయిర్ పోర్టులపై ఇరాన్ చేసిన డ్రోన్ దాడుల్లో ఎవరికి గాయాలు కాలేదని సమాచారం. అయితే ఈ రెండు విమానాశ్రయాల నుంచి భారీ స్థాయిలో దట్టమైన పొగలు వచ్చాయని, అక్కడి అధికారులు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ దాడుల్లో జోర్డాన్ పౌరుడు గాయపడినట్లు పేర్కొంది. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇరాన్ నుంచి వస్తున్న డ్రోన్లను, క్షిపణులను వైమానిక రక్షణ వ్యవస్థ అడ్డుకుంటుందని దుబాయ్ మీడియా పేర్కొంది. అయితే ఈ వ్యవస్థ నుంచి తప్పించుకున్న డ్రోన్ల కారణంగా తాజాగా ఎయిర్ పోర్టుల్లో పేలుళ్లు జరిగాయని దుబాయ్ మీడియా పేర్కొంది. ఇరాన్‌లోని 90 శాతం చమురును అందించే కీలకమైన ఖార్గ్ దీవిపై అమెరికా దాడి చేయడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ క్రమంలోనే ఇవాళ( ఆదివారం) దుబాయ్, కువైట్ ఎయిర్ పోర్టులపై దాడులు జరిగాయి .

యూఏఈపై 1,800 కి పైగా క్షిపణులు, డ్రోన్లను ఇరాన్ ప్రయోగించింది. టెహ్రాన్ గల్ఫ్ దేశాలను లక్ష్యంగా చేసుకున్న దాడుల్లో యూఏఈపై జరిగినవే ఎక్కువ. ఇందులో1,600 డ్రోన్లు, 294 బాలిస్టిక్ క్షిపణులు , 15 క్రూయిజ్ క్షిపణులు ఉన్నాయి. ఈ దాడులలో ఆరుగురు మరణించారు. 141 మంది గాయపడ్డారు. శనివారం ఒక్క రోజే, తొమ్మిది బాలిస్టిక్ క్షిపణులు, 33 డ్రోన్లు యూఏఈపై ఇరాన్ ప్రయోగించింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version