ఐదో రోజు శ్రీధర్‌ను విచారిస్తున్న..!

ఐదో రోజు శ్రీధర్‌ను విచారిస్తున్న ఏసీబీ

 

అక్రమాస్తుల కేసులో అరెస్టయిన ఈఈ శ్రీధర్‌ను కస్టడీకి తీసుకున్న ఏసీబీ అధికారులు ఐదో రోజు మంగళవారం విచారిస్తున్నారు. ఈ రోజు మరికొన్ని లాకర్లు కూడా తెరిచే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ రోజుతో ఆయన విచారణ ముగియనుంది.

 

 

 

Hyderabad: అక్రమాస్తుల కేసు (Illegal Assets Case)లో ఐదో రోజు (5th Day) మంగళవారం నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్‌ (EE Sridhar)ను కస్టడీ (custody)లోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు (ACB investigation). ఈ రోజుతో ఆయన కస్టడీ ముగియనుంది. కోర్టు అనుమతితో మరోసారి శ్రీధర్‌ను కస్టడీకి తీసుకునే ఆలోచనలో ఏసీబీ అధికారులు అన్నారు. ఇంత వరకు జరిగిన విచారణలో శ్రీధర్ అక్రమంగా సంపాదించిన డబ్బును రియల్ ఎస్టేట్‌లో పెట్టినట్లు ఏసీబీ అధికారులు ఆధారాలు సేకరించారు. శ్రీధర్ బ్యాంకు లాకర్లలో భారీగా ఆస్తి పత్రాలు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు లాకర్లలో స్వాధీనం చేసుకున్న ఆస్తులు విలువ సుమారు రూ. 5 కోట్లు పైనే ఉంటుందని అంచనా వేశారు.

లాకర్‌లో రూ. 5 కోట్లు స్వాధీనం..

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో 6, 7, 8 పనులు పర్యవేక్షించిన నీటిపారుదల శాఖ ఈఈ నూనె శ్రీధర్‌ అక్రమాస్తుల చిట్టా అంతకంతకు పెరుగుతోంది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అతన్ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే రూ. వందల కోట్ల విలువైన ఆస్తుల్ని గుర్తించిన అధికారులు.. కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని విచారిస్తున్న క్రమంలో మరికొన్ని ఆస్తుల్ని కనుగొన్నారు. జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న శ్రీధర్‌ను కోర్టు అనుమతితో ఏసీబీ అధికారులు ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు. సోమవారం అతని బ్యాంకు లాకర్లను తెరిచారు. వాటిలో దొరికిన స్థిరాస్తుల పత్రాలు, బంగారం విలువ రూ.5 కోట్లపైనే ఉంటుందని అంచనా వేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతికి సంబంధించి అరెస్టయిన మిగతా వారు కూడా అక్రమంగా సంపాదించిన సొమ్మును రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో పెట్టుబడులుగా పెట్టినట్లు ఏసీబీ అధికారులు ఆధారాలు సేకరించారు. శ్రీధర్‌ కస్టడీ గడువు మంగళవారంతో ముగియనుంది. ఈ క్రమంలో కోర్టు అనుమతితో అతన్ని మరోసారి కస్టడీకి తీసుకుని ప్రశ్నించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

మరిన్ని లాకర్లు తెరిచే అవకాశం..

అక్రమంగా ఆస్తులు కూడబెట్టారంటూ కాళేశ్వరం ప్రాజెక్టు ఈఈగా పనిచేసిన శ్రీధర్‌పై ఏసీబీ అధికారులు ఈ నెల 11న కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అధికారుల సోదాల్లో పెద్ద ఎత్తున ఆస్తులు గుర్తించారు. వాటి విలువ మార్కెట్‌ లెక్కల ప్రకారం రూ. 150 కోట్ల మేర ఉంటుందని అంచనా. శ్రీధర్‌ను అరెస్టు చేసి రిమాండుకు తరలించిన అధికారులు తదుపరి దర్యాప్తులో భాగంగా న్యాయస్థానం అనుమతితో తమ కస్టడీలోకి తీసుకుని ఈనెల 20వ తేదీ నుంచి విచారిస్తున్నారు. దీనిలో భాగంగా ఎస్‌బీఐలో శ్రీధర్‌ పేరు మీద ఉన్న లాకర్‌ను ఆయన సమక్షంలోనే అధికారులు తెరిచారు. ఇందులో పెద్దఎత్తున ఆస్తిపత్రాలు, బంగారు ఆభరణాలు గుర్తించారు. వాటికి పంచనామా నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. విచారణలో చివరి రోజైన మంగళవారం మరికొన్ని లాకర్లు కూడా తెరిచే అవకాశం ఉంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version