నర్సంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సొంత భవనం నిర్మించాలి…

నర్సంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సొంత భవనం నిర్మించాలి

శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల

ఏఐఎఫ్డిఎస్ ఆధ్వర్యంలో కలెక్టర్ వినతిపత్రం

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట పట్టణంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సొంత భవనం నిర్మించాలని కోరుతూ ఏఐఎఫ్డిఎస్ ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ వినతిపత్రం అందజేశారు.ఆ శాఖ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జన్నూ రమేష్, చుక్క ప్రశాంత్ మాట్లాడుతూ నర్సంపేట పట్టణంలోని ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల పెచ్చులు ఊడిపోయి శిథిలావస్థలో ఉన్నదని అవేదన వ్యక్తం చేశారు.ఆ స్థానంలో నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నూతన భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.అలాగే 2018లో గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయాలన్నారు.సాంఘిక సంక్షేమ వసతి గృహాలు గురుకుల పాఠశాలలు అద్దె భవనంలో నడుస్తున్నాయని వాటికి సొంత భవనాలు నిర్మించాలని వివరించారు.ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణంలో ప్రత్యేకంగా మహిళలకు హాస్టల్ నిర్మించి వసతి కల్పించాలని వారు కోరారు. లేనియెడల ఏఐఎఫ్డిఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు వెనీష్, నాయకులు పవన్ తదితరులు పాల్గొన్నారు.

విహారయాత్రలో విషాదం.. కృష్ణా నదిలో కూకట్‌పల్లి యువకుడి గల్లంతు…

విహారయాత్రలో విషాదం.. కృష్ణా నదిలో కూకట్‌పల్లి యువకుడి గల్లంతు

విహారయాత్రకు వెళ్లిన యువకుడు కృష్ణా నదిలో ఈతకు దిగి గల్లంతయ్యాడు. మంగళవారం మధ్యాహ్నం నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్‌ పైలాన్‌ కాలనీ కొత్త వంతెన దిగువన ఉన్న ఆంజనేయస్వామి పుష్కర ఘాట్‌ వద్ద ఈ ఘటన జరిగింది.

 విహారయాత్రకు వెళ్లిన యువకుడు కృష్ణా నదిలో ఈతకు దిగి గల్లంతయ్యాడు. మంగళవారం మధ్యాహ్నం నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్‌(Nagarjuna Sagar) పైలాన్‌ కాలనీ కొత్త వంతెన దిగువన ఉన్న ఆంజనేయస్వామి పుష్కర ఘాట్‌ వద్ద ఈ ఘటన జరిగింది. సాగర్‌ సీఐ శ్రీనునాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్‌పల్లి(Kukatpally)కి చెందిన జ్ఞానేందర్‌, సుమన్‌, మణికంఠ, వెంకటేష్‌, హర్షవర్ధన్‌, చాణుక్య ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. సాగర్‌ సందర్శన నిమిత్తం మంగళవారం రెండు ద్విచక్రవాహనాలపై సాగర్‌కు చేరుకున్నారు. ప్రధాన డ్యామ్‌కు దిగువన ఉన్న పుష్కర ఘాట్‌ వద్ద ఈత కొట్టేందుకు నీటిలోకి దిగారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version