ఇసుక కు వే బిల్లుల అనుమతులు యధావిధిగాఇవ్వాలి….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక మానేరువాగునుండి ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక అనుమతులు లభించడంతో వే బిల్లుల ద్వారా ఇసుక రవాణాకు సౌకర్యం కల్పిస్తూ స్థానిక ఎమ్మార్వో వే బిల్లులు ఇవ్వడంతో ట్రాక్టర్ యజమానులము సిబ్బంది అందరం కలిసి మానేరు వాగులోని ఇసుక తీసుకొని వెళుతుండగా చుట్టుపక్కల పొలాలకుచెందిన రైతులతో చిన్న సమస్య ఏర్పడడంతో వాటిని పరిష్కారం చేసుకొని వెళ్తామని చెప్పినా కూడా వినకుండా సంబంధిత అధికారులు రెవెన్యూ అధికారులు వచ్చి ట్రాక్టర్లు లోడ్ చేసిన ఇసుకను మానేరు వాగులో విడిచి వెళ్లాలని ట్రాక్టర్ యజమానులతో స్థానిక ఎమ్మార్వో రెవెన్యూ సిబ్బంది చెప్పడంతో ట్రాక్టర్ సిబ్బంది యజమానులు అందరూ కలిసి ట్రాక్టర్లు నిలిపివేసి ధర్నా చేస్తూ ఎమ్మార్వో వచ్చి తమకు యధావిధిగా వే బిల్లులకు అనుమతి ఇవ్వవలసిందిగా కోరుచున్నామనిఏదైనా సమస్య ఉంటే రైతులతో మా యజమానులు అందరం కలిసి సమస్య పరిష్కారమయ్యే దిశగా చేసుకుంటామని ఈ సందర్భంగా స్థానిక సిబ్బందిని ఎమ్మార్వో ని వేడుకుంటూ ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక అవసరం ఉన్నందున కట్టుకోవడానికి ఇబ్బంది అవుతున్న నేసేద్యంలో అనుమతులు ఇవ్వాలని ఈ సందర్భంగా ధర్నా చేస్తూ ఎమ్మార్వో వచ్చి సమస్య పరిష్కరించాలని యజమానులసంఘం సిబ్బంది ఇట్టి ధర్నా కార్యక్రమంలో తంగళ్ళపల్లి ట్రాక్టర్ యజమానుల సంఘం అధ్యక్షులు భాస్కర్ ట్రాక్టర్ యజమానులు లేబర్స్ తదితరులు పాల్గొన్నారు
