ప్రభుత్వ స్థలంలో ప్రయివేటు నిర్మాణం చోద్యం చూస్తున్న అధికారులు

ప్రభుత్వ స్థలంలో ప్రయివేటు నిర్మాణం చోద్యం చూస్తున్న అధికారులు

◆-: పల్లె ప్రకృతి వనం దారిని ఖబ్జాచేసి షెడ్డు నిర్మిస్తున్న వైనం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంబించిన పల్లె ప్రకృతి వనం అధికారుల నిర్లక్ష్యంతో కబ్జాకు గురై ప్రయివేటు నిర్మాణనికి పూనుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లా శాసనసభ పరిది కోహిర్ మండలంలోని సజ్జపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలోని పల్లె ప్రకృతి వనం కబ్జా విషయమై గ్రామ పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లి వివరణ కోరగా ఇది గ్రామ కంఠంలో లేదని, స్థలం పత్రాలను సంబంధిత రెవెన్యూ, అటవీ శాఖ అధికారులకు సమర్పించి ఈ యొక్క భూమి యాజమాన్యాన్ని తేల్చాల్సిందిగా కోరడం జరిగిందని అన్నారు. దీనిపై రెండు నుంచి మూడు రోజుల్లో యాజమాన్యం విషయం స్పష్టత వచ్చే అవకాశం ఉందని కార్యదర్శి తెలిపారు.

గత ప్రభుత్వం గ్రామాల్లో పర్యావరణ పరిరక్షణ, సమతౌల్యం కోసం పల్లెల్లో వనాలను నిర్మించారని, దాని ఉద్దేశాన్ని అధికారుల విస్మరించి నిరుగారుస్తున్నారని, ప్రయివేటు నిర్మాణం వల్ల పల్లె ప్రకృతి వనం లోపలికి వెళ్లే దారిని మూసివేస్తు నిర్మాణం చేశారని, ఇప్పటికైనా రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు స్పందించి కబ్జా బారి నుంచి కాపాడాలని సజ్జపూర్ గ్రామ ప్రజలు కోరారు. ఇక్కడ విశేషమేమిటంటే పంచాయతీ ఎన్నికల రెండు రోజుల ముందు అధికారులు ఎన్నికల నిర్వహణలో ఉండటన్ని అదునుగా చూసుకొని షెడ్డు గోడలు నిర్మించడం విశేషం.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version