పలు ఆసుపత్రుల్లో ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమాలు

పలు ఆసుపత్రుల్లో ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమాలు

సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి-ఫైర్ ఆఫీసర్ భద్రయ్య

పరకాల,నేటిధాత్రి

ఫైర్ సర్వీస్ వీక్ వారోత్సవాల సందర్భంగా శుక్రవారం పరకాల పట్టణంలోని సంతోష్ హాస్పిటల్,వినూత్న న్యూరో అండ్ జనరల్ హాస్పిటల్‌లలో అగ్ని భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.ఈ కార్యక్రమంలో భాగంగా ఫైర్ సిబ్బంది హాస్పిటల్ సిబ్బందికి ఫైర్ సేఫ్టీ చర్యలపై వివరించి,అత్యవసర పరిస్థితుల్లో చేపట్టాల్సిన ఇవాక్యుయేషన్ డ్రిల్స్ నిర్వహించారు.స్టేషన్ ఫైర్ ఆఫీసర్ వి.భద్రయ్య ఆధ్వర్యంలో కరపత్రాల పంపిణీతో పాటు గోడలకు పోస్టర్లు అంటించి అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఫైర్ ఆఫీసర్ మాట్లాడుతూ,ఆసుపత్రుల్లో ముఖ్యంగా ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్,గ్యాస్ లీకేజీ కారణంగా అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.అలాంటి పరిస్థితుల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రారంభ దశలోనే మంటలను అదుపులోకి తీసుకురావాలని సూచించారు.అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పరకాల ఫైర్ స్టేషన్ నంబర్ 87126 99306 కు సమాచారం అందించాలని సూచించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version