పలు ఆసుపత్రుల్లో ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమాలు

పలు ఆసుపత్రుల్లో ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమాలు

సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి-ఫైర్ ఆఫీసర్ భద్రయ్య

పరకాల,నేటిధాత్రి

ఫైర్ సర్వీస్ వీక్ వారోత్సవాల సందర్భంగా శుక్రవారం పరకాల పట్టణంలోని సంతోష్ హాస్పిటల్,వినూత్న న్యూరో అండ్ జనరల్ హాస్పిటల్‌లలో అగ్ని భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.ఈ కార్యక్రమంలో భాగంగా ఫైర్ సిబ్బంది హాస్పిటల్ సిబ్బందికి ఫైర్ సేఫ్టీ చర్యలపై వివరించి,అత్యవసర పరిస్థితుల్లో చేపట్టాల్సిన ఇవాక్యుయేషన్ డ్రిల్స్ నిర్వహించారు.స్టేషన్ ఫైర్ ఆఫీసర్ వి.భద్రయ్య ఆధ్వర్యంలో కరపత్రాల పంపిణీతో పాటు గోడలకు పోస్టర్లు అంటించి అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఫైర్ ఆఫీసర్ మాట్లాడుతూ,ఆసుపత్రుల్లో ముఖ్యంగా ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్,గ్యాస్ లీకేజీ కారణంగా అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.అలాంటి పరిస్థితుల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రారంభ దశలోనే మంటలను అదుపులోకి తీసుకురావాలని సూచించారు.అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పరకాల ఫైర్ స్టేషన్ నంబర్ 87126 99306 కు సమాచారం అందించాలని సూచించారు.

పరకాలలో అగ్నిమాపక అవగాహన కార్యక్రమాలు..

పరకాలలో అగ్నిమాపక అవగాహన కార్యక్రమాలు

ప్రమాదసమయంలో పాటించే చర్యలపై ప్రజలకు సూచనలు

పరకాల,నేటిధాత్రి

3333అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో పట్టణంలో అగ్నిమాపక వారోత్సవాలు కొనసాగుతున్నాయి.ఫైర్ సర్వీస్ వీక్‌లో భాగంగా గురువారం పట్టణంలోని సగరవీధి కాలనీలో కరపత్రాల పంపిణీ,గోడలపై పోస్టర్ల ఏర్పాటు ద్వారా గృహాల్లో గ్యాస్ ప్రమాదాలు,షార్ట్ సర్క్యూట్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్బంగా ఫైర్ ఆఫీసర్ భద్రయ్య మాట్లాడుతూ ప్రజల్లో అగ్ని ప్రమాదాలపై అవగాహన పెంచేందుకు పాఠశాలలు, కార్యాలయాలు,వ్యాపార సంస్థలు,గ్రామాల్లో సదస్సులు,మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నామని,విద్యుత్ భద్రత,ఎల్పీజీ వినియోగం,గ్యాస్ లీకేజీ నివారణ,అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు అందిస్తున్నట్లు వివరించారు.ఈ కార్యక్రమంలో ఎల్ఎఫ్ఎఫ్ కృష్ణ కుమార్,ఎఫ్ఎఫ్టి గణేష్,ఎఫ్ఎఫ్ లు దిలీప్,రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version