గ్రామ ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి పున ప్రతిష్ట పూజలు.

గ్రామ ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి పున ప్రతిష్ట పూజలు.

చిట్యాల, నేటిదాత్రి :

 

జయ శంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని గుంటూరు పల్లి గ్రామంలో శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి పున ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగిందని సర్పంచి నాగమల్లేశ్వరరావు ఉపసర్పంచి ముద్దన నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామం ఏర్పడి దాదాపు 70 సంవత్సరాల క్రితం మా ఊరి ఇలవేల్పు దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దయా కటాక్షం వల్ల ఈరోజు మా గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో పాడి పంటలతో అష్టైశ్వర్యాలతో ఉన్నామని ఇదే ఆచారము గత 70 సంవత్సరాల నుంచి మా ఊరిలో నూతన దంపతులు శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎదురు నడిచే కార్యక్రమం కొనసాగుతుందని అలాగే గత 70 సంవత్సరాల నుంచి నిరాదరణకు గురి అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఇలవేల్పు దైవము మన్నెం శ్రీనివాసు శ్రీలత దంపతుల సహకారంతో నేడు పున ప్రతిష్ట జరిగి అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు మహిళలు మంగళహారతులతో కొబ్బరికాయలతో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారుఅలాగే మాఊరి పెద్దల సహకారంతో గత 70 సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారాన్ని కొనసాగిస్తున్నామని, నూతనంగా ఎన్నికైన సర్పంచిగా గ్రామ ప్రజల సహకారంతో ఈరోజు పున ప్రతిష్ట కార్యక్రమం పూజలు చేయడం సంతోషంగా ఉందని అన్నారు, ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాగమల్లేశ్వరరావు, ఉప సర్పంచ్ ముద్దన నాగరాజు, మన్నెం శ్రీనివాసరావు కంకణాల శ్రీనివాసు, శ్రీమన్నారాయణ, సీనియర్ నాయకులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు నర్రా రామకృష్ణ వార్డ్ మెంబర్లు,గ్రామ మహిళలు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version