పొగాకు వాడకం ఆరోగ్యానికి హానికరం
ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి దిలీప్ కుమార్ నాయక్
భూపాలపల్లి నేటిధాత్రి
కుటుంబ సభ్యులు, స్నేహితులు తెలిసిన వారితో పొగాకు వాడటం మాన్పించాలని ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.ఆర్.దిలీప్ కుమార్ నాయక్ అన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్బంగా కోర్టు ప్రాంగణంలో ప్రతిజ్ఞ చేశారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.ఆర్.దిలీప్ కుమార్ నాయక్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ పొగాకు వాడటం వలన కాన్సర్ బారిన పడుతారని, మెదడు, గుండె ఊపితిత్తులకు చాలా ప్రమాదం అన్నారు. ఈ కార్యక్రమంలో కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.