జగద్గురు శ్రీనివాస గురు స్వామికి ఘన స్వాగతం
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గంలోని యాదగిరి మఠాన్ని జగద్గురు సరస్వతి పీఠాధిపతులు శ్రీ శ్రీనివాస గురు స్వామి సందర్శించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ సమాజ బంధువులు ఆయనకు ఘన స్వాగతం పలికి, ఆశీర్వాదాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఏ. రాజేశ్వర్ చారి, మునేశ్వర్ చారి, సదానంద చారి, ఏ. రాజు చారి, వి. మారుతి చారి, బ్రహ్మయ్య చారి, హనుమాన్ చారి తదితర విశ్వకర్మ సమాజ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్లో జరిగింది.
